The Indian Border: దేశభక్తిని రగిలిస్తున్న ‘జిందా రహేన్ తో డ్యూటీ’!

Soldier

Soldier

ఆర్ట్ ఇన్ హార్ట్ క్రియేషన్స్ పతాకంపై నివేద్య రెడ్డి నిర్మాణంలో, డి.ఎస్. బాషా దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేశభక్తి చిత్రం ‘ది ఇండియన్ బార్డర్’. కిరణ్ యార్లగడ్డ, ఆదర్ష్, మురళీ మోహన్, మేఘా శ్రీ, సింధు తులాని ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుంచి ‘జిందా రహేన్ తో డ్యూటీ’ అనే దేశభక్తి గీతాన్ని చిత్ర బృందం ఘనంగా విడుదల చేసింది.

హీరో & రైటర్ కిరణ్ యార్లగడ్డ మాట్లాడుతూ “పాలస్తీనా యుద్ధం సమయంలో నాలో పుట్టిన ఆలోచనే ఈ కథ. దేశ సరిహద్దుల్లో ఒక సైనికుడు చేసే త్యాగంతో పాటు, ఇంట్లో సైనికుడి భార్య చేసే త్యాగాలను కూడా ఇందులో బలంగా చూపించాం.” అన్నారు. దర్శకుడు డి.ఎస్. బాషా మాట్లాడుతూ “మనం ఇక్కడ ప్రశాంతంగా జీవిస్తున్నామంటే కారణం సరిహద్దుల్లో సైనికులు చేసే త్యాగాలే. వారి గొప్పతనాన్ని చాటిచెప్పేలా ఈ కథను మలిచాం అన్నారు.  ఈ చిత్రంలో ఆదిత్య మీనన్, అజయ్, ఇందు ఆనంద్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా, నలినికాంత్ కొండపల్లి సినిమాటోగ్రఫీ, కె. రమేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.