M.S. Subbulakshmi : కమల్ హాసన్ చీఫ్ గెస్ట్ గా ‘MS సుబ్బులక్ష్మి’ బయోపిక్ ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతరత్న, కర్ణాటక సంగీత సామ్రాజ్ఞి ఎం.ఎస్. సుబ్బలక్ష్మి గారి 110వ జయంతి సందర్భంగా ఆమె పవిత్ర జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కరించేందుకు రంగం సిద్ధమైంది. గీతా ఆర్ట్స్, రాక్‌లైన్ ఎంటర్టైన్మెంట్స్ మరియు బివి వర్క్స్ పతాకాలపై అల్లు అరవింద్, రాక్‌లైన్ వెంకటేష్ మరియు బన్నీ వాస్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంలో ఎం.ఎస్. సుబ్బలక్ష్మి గారి పాత్రలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తుండగా, ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రం ప్రారంభోత్సవ వేడుక సెప్టెంబర్ 16, 2026 బుధవారం సాయంత్రం 6:00 గంటలకు చెన్నైలోని ప్రతిష్టాత్మక ‘ది మ్యూజిక్ అకాడమీ’ ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు లోకనాయకుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అంతేకాకుండా, ఇండియన్ కోరల్ ఎన్సెంబుల్ బృందం ద్వారా ఎం.ఎస్. సుబ్బలక్ష్మి అమ్మగారి ఐకానిక్ గీతాల లైవ్ పెర్ఫార్మెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ ఈవెంట్‌కు ‘ఎంఎస్ బ్లూ’ రంగు దుస్తుల డ్రెస్ కోడ్‌ను నిర్ణయించారు.అత్యున్నత సాంకేతిక విలువల తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ స్వరాలు అందిస్తున్నారు. సంగీత ప్రపంచంలో సరికొత్త శకానికి నాంది పలికిన ఎం.ఎస్. సుబ్బలక్ష్మి గారి వారసత్వాన్ని, ఆమె జీవితంలోని అరుదైన ఘట్టాలను ఈ చిత్రం ద్వారా నేటి తరానికి అందించబోతున్నారు. సెప్టెంబర్ 16న జరిగే ఈ గ్రాండ్ లాంచ్‌తో సినిమాకి సంబంధించిన మరిన్ని విశేషాలు వెల్లడి కానున్నాయి.
Also Read
- BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
తాజావార్తలు
-
US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
-
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
-
Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
-
AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
-
BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?