Site icon NTV Telugu

Anaswara : స్పీడు మీదున్న హీరోయిన్.. ఏకంగా 5 సినిమాలు రిలీజ్

Answara

Answara

ఇప్పటి వరకు రష్మిక స్పీడుకే ఫిదా అయిపోతుంటే. ఆమెనే మించిపోతుంది కేరళ కుట్టి అనశ్వర రాజన్. సూపర్ శరణ్య, నేరు, గురువాయిర్ అంబలనడయల్ లాంటి డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది అనశ్వర. చిన్న వయస్సులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ మల్లు బ్యూటీ ఇప్పుడు కేరళలో బిజీయెస్ట్ అండ్ సక్సెస్ ఫుల్ హీరోయిన్. చిన్న బడ్జెట్ అండ్ లేడీ ఓరియెంట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్సయ్యింది.

Also Read : Malavika Mohanan : ఫొటోస్ తో మత్తెక్కిస్తున్న మాళవిక.. చూస్తే ఆగదిక..

ఈ ఏడాది రేఖా చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనశ్వర. ఈ ఆరు నెలల కాలంలో ఐదు సినిమాలను దించేసి మాలీవుడ్ ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది. ఈ తరం హీరోయిన్లలో ఈమెలా సూపర్ ఫాస్ట్‌గా సినిమాలు చేసిన ముద్దుగుమ్మ మరొకరు లేరనే చెప్పాలి. హిట్స్, ప్లాప్స్‌తో సంబంధం లేకుండా దూసుకెళుతోంది. రేఖా చిత్రం తర్వాత వచ్చిన ఎన్ స్వాంతమ్ పుణ్యాలం, పైంకిలీ పెద్దగా సందడి చేయలేకపోయాయి. మిస్ అండ్ మిస్టర్ బ్యాచ్‌లర్ సోసో అనిపించుకుంది. రీసెంట్లీ రిలీజైన వ్యాసన సమేతమ్ బంధుమిత్రాదికల్‌తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కింది అనశ్వర. పాజిటివ్ టాక్‌తో థియేటర్లలో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు విపిన్ దాస్ తో కలిసి  టాలీవుడ్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి నిర్మించారు. ఇక అనశ్వర రాజన్ చేతిలో రెండు, మూడు ప్రాజెక్టులున్నాయి. వాటిల్లో ఒకటి సెవెన్ బై జీ బృందావన్ కాలనీ సీక్వెల్‌. ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఏడాదికి మినిమం మూడు నాలుగు చిత్రాలను దించేసే భవిష్యత్తులో స్టార్ హీరోయిన్ స్టేటస్ కు చేరుకునేందుకు పరుగులు పెడుతోంది.

 

Exit mobile version