Site icon NTV Telugu

Sanya Malhotra: హిందీలోకి ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’!

The-Greate-Indian-Kitchen

గత యేడాది జనవరిలో విడుదలైన మలయాళ చిత్రం ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ వీక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. వంటగదికి పరిమితమైపోయిన భారతీయ మహిళ మనోభావాలను దర్శకుడు జియో బేబీ చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఎంతో సున్నితమైన అంశాన్ని అందరూ ఆమోదించేలా తెరపై చూపించాడు. నిమిషా సజయన్, సూరజ్ వెంజరమూడ్ భార్యభర్తలుగా చక్కని నటన కనబరిచారు. ఇదే చిత్రాన్ని ప్రస్తుతం తమిళంలో రీమేక్ చేస్తున్నారు.

Read Also : Bheemla Nayak Pre-release Event : ‘పుష్ప’ మిస్టేక్స్ రిపీట్ కాకుండా ఆ బాధ్యత పోలీసులకే !

ఐశ్వర్య రాజేశ్‌, రాహుల్ రవీంద్రన్ జంటగా నటిస్తున్నారు. ఈ తమిళ రీమేక్ ను ఆర్. కన్నన్ దర్శకత్వంలో దుర్గారమ్ చౌదరి, నీల్ చౌదరి నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ హిందీ రీమేక్ వివరాలు అధికారికంగా వచ్చాయి. ‘దంగల్’ ఫేమ్ సన్యా మల్హోత్రా ఇందులో నాయికగా నటించబోతోంది. ‘కార్గో’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ఆరతి కడవ్ చేతికి ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ రీమేక్ బాధ్యతలను అప్పగించారు నిర్మాత హర్మాన్ బవేజా!

https://www.youtube.com/watch?v=v97rAjyN_hQ
Exit mobile version