మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీ సూపర్ హీరో సినిమా లవర్స్ కి బిగ్గెస్ట్ ట్రీట్ ఇచ్చేసింది. కెప్టెన్ అమెరికా నుంచి ఐరన్ మ్యాన్ వరకు, బ్లాక్ పాంథర్ నుంచి డాక్టర్ స్ట్రేంజ్ వరకూ మార్వెల్ యూనివర్స్ లో ఉన్న ప్రతి సూపర్ హీరో అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమాలో కనిపిస్తారు. వరల్డ్ సినిమా చూసిన బెస్ట్ ఫినిషింగ్స్ లో అవెంజర్స్ ఎండ్ గేమ్ క్లైమాక్స్ టాప్ ప్లేస్ లో ఉంటుంది. మార్వెల్ హీరోలు అందరూ ఒకటే చోట కనిపిస్తారు కాబట్టే ఆ సీన్ అంత స్పెషల్ గా నిలిచింది. ఇప్పుడు డిస్నీ కూడా ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నట్లు ఉంది. వార్నర్ బ్రదర్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘ది ఫ్లాష్’ మూవీ జూన్ 16న ఆడియన్స్ ముందుకి రాబోతుంది. ఈ మూవీ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. DCU లవర్స్ ని ఎగ్జైట్ చేసిన ‘ది ఫ్లాష్’ ట్రైలర్ సెన్సేషనల్ వ్యూస్ ని రాబడుతుంది. దీనికి కారణం ది ఫ్లాష్ అఫీషియల్ ట్రైలర్ లో ‘బాట్ మాన్’, ‘సూపర్ వుమెన్’ కూడా కనిపించడమే. ట్రైలర్ చూస్తుంటే బాట్ మాన్ క్యారెక్టర్ ది ఫ్లాష్ మూవీలో ఫుల్ లెంగ్త్ ఉన్నట్లు అనిపిస్తుంది.
జనరల్ జాడ్ గా మైఖేల్ షనన్ కూడా కనిపించడంతో ది ఫ్లాష్ ట్రైలర్ మరింత స్పెషల్ గా మారింది. సూపర్బ్ విజువల్ ఎఫెక్ట్స్ ఫ్లాష్ ట్రైలర్ ని వర్త్ వాచ్ గా మార్చాయి. ట్రైలర్ తో ది ఫ్లాష్ మూవీపై ఎక్స్పెక్టేషన్ అమాంతం పెరిగాయి. ఇదే రేంజులో మూవీ ఉంటే DCUలో ది ఫ్లాష్ చాలా స్పెషల్ మూవీ అయ్యే ఛాన్స్ ఉంది. బాట్ మాన్ క్యారెక్టర్ కి ఇండియాలో మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి ది ఫ్లాష్ మూవీ ఇండియాలోనే A సెంటర్స్ లో సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టే ఛాన్స్ ఉంది. అయితే ఇదే సమయంలో ప్రభాస్ నటిస్తున్న ఆది పురుష్ మూవీ రిలీజ్ అవుతుంది. మరి ఆది పురుష్ ఇంపాక్ట్ ది ఫ్లాష్ పైన ఉంటుందా? లేక ది ఫ్లాష్ సినిమానే మల్టీప్లెక్స్ ల్లో ఆది పురుష్ కలెక్షన్స్ కి డెంట్ పెడుతుందా అనేది చూడాలి.
