NTV Telugu Site icon

The Family Star: ఈ పని చేస్తే, మీ ఇంటికే “ఫ్యామిలీ స్టార్” టీమ్!

Dil Raju The Family Star

Dil Raju The Family Star

The Family Star team is going to pay a surprise visit to Real family stars: విజయ్ దేవరకొండ ది ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5న తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల డైరెక్ట్ చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద దిల్ రాజు-శిరీష్ నిర్మించిన ఈ సినిమా యూనిట్ ఒక ఆసక్తికర ప్రకటన చేసింది. దాని ప్రకారం సినిమా టీం మీ ఇంటికి వచ్చి మీ ఫ్యామిలీ స్టార్ ను సర్ ప్రైజ్ చేస్తారట. ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణతో సక్సెస్ ఫుల్ థియేట్రికల్ రన్ కంటిన్యూ చేస్తోందని సినిమా యూనిట్ వెల్లడించింది తమ ఫ్యామిలీకి సపోర్ట్ గా నిలబడే వాళ్లంతా ఫ్యామిలీ స్టార్సే అనేది ఈ మూవీ స్టోరీ లైన్ కాగా అలాంటి ఫ్యామిలీ స్టార్స్ ను కలిసేందుకు ఫ్యామిలీ స్టార్ టీమ్ సర్ ప్రైజ్ విజిటింగ్ కు వస్తోందని సినిమా యూనిట్ వెల్లడించింది.

Ring Riyaz: సీఎం జగన్‌ను ట్రోల్ చేసి ఫేమస్.. ఇప్పుడు ఆయన పక్కనే కూర్చుని ఫొటో!

మీ ఇంటి ఫ్యామిలీ స్టార్ ను ఫ్యామిలీ స్టార్ టీమ్ కలవాలని కోరుకునే రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు గొప్ప అవకాశం ఇదని పేర్కొంది. ఈ అనౌన్స్ మెంట్ లోని ఫామ్ ఫిల్ చేస్తే ఫ్యామిలీ స్టార్ టీమ్ హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజు, హీరోయిన్ మృణాల్ ఠాకూర్, దర్శకుడు పరశురామ్ పెట్ల మీ ఇంటికి వచ్చి మీ ఫ్యామిలీ స్టార్ ను సర్ ప్రైజ్ చేస్తారని, ఈ ఫామ్ లో మీ పేరు అడ్రస్ తో పాటు మీ ఫ్యామిలీ స్టార్ ఎ‌వరు, ఎందుకు అనే ప్రశ్నలకు ఆన్సర్స్ రాసి ఫిల్ చేయాలని పేర్కొన్నారు. ఇక నిన్న థియేటర్స్ లోకి వరల్డ్ వైడ్ రిలీజ్ కు వచ్చింది ఫ్యామిలీ స్టార్ సినిమా. తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు సహా ఓవర్సీస్ లోనూ మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ముఖ్యంగా ఈ సినిమా టార్గెటెడ్ ఆడియెన్స్ అయిన సకుటుంబ ప్రేక్షకులకు బాగా రీచ్ అవుతోందని సినిమా యూనిట్ వెల్లడించింది.

Show comments