వన్ ఇయర్ బ్యాక్ కోలీవుడ్ సినిమా ఒక సెన్సేషన్ ని చూసింది. కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న ఒక యంగ్ డైరెక్టర్, లోకనాయకుడు కమల్ హాసన్ ని డైరెక్ట్ చేసి బాక్సాఫీస్ ని కుదిపేసాడు. తమిళ సినీ చరిత్రలోనే రెండో అతిపెద్ద హిట్ గా నిలిచిన ఆ సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అనే ప్రపంచానికి పునాది వేసింది. ఈ పాటికి ఆ సినిమా పేరు విక్రమ్ అని, దాన్ని డైరెక్ట్ చేసింది లోకేష్ కనగరాజ్ అనే విషయం మీకు అర్ధమయ్యి పోయి ఉంటుంది. కమల్ హాసన్ ఒకప్పుడు తను 400 కోట్లు వసూల్ చేసే సినిమా చేస్తాను అంటే చాలా మంది నవ్వారు. ఆ నవ్విన అందరినీ సైలెంట్ చేసింది విక్రమ్ మూవీ. గతంలో వచ్చిన విక్రమ్ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీలో కమల్ హాసన్ తో పాటు ఫాహద్ ఫజిల్, విజయ్ సేతుపతి కూడా నటించారు. ట్రెమండస్ పెర్ఫార్మర్స్ అయిన ఈ ముగ్గురూ కలిసి అద్భుతంగా నటించారు. యాక్షన్ మూవీ లవర్స్ కి ఐ ఫీస్ట్ గా నిలిచిన విక్రమ్ ఈ సినిమాకి ప్రాణం పోసింది మాత్రం అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనే చెప్పాలి. ఈగల్ ఈజ్ కమింగ్, మోనింగ్ బీజీఎమ్ లు అయితే అసలు ఇంకో లెవల్ లో ఉంటాయి. పైలెట్ స్క్వాడ్ హెడ్, ది ఘోస్ట్ గా కమల్ హాసన్ నెవర్ బిఫోర్ స్క్రీన్ ప్రెజెన్స్ తో మెస్మరైజ్ చేసాడు.
లోకేష్ కనగరాజ్ తన మార్క్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ తో ఆడియన్స్ ఇంప్రెస్ చేసాడు. ముఖ్యంగా ఫైట్స్ ని అతను తెరకెక్కించిన విధానం సినీ అభిమానులని కట్టి పడేసింది. ఖైదీ సినిమాకి విక్రమ్ ని లింక్ చేసి ఒక కొత్త ప్రపంచాన్ని లోకేష్ క్రియేట్ విధానానికి క్రిటిక్స్ సైతం ఫిదా అయిపోయారు. విక్రమ్ సినిమా అంతా ఒకెత్తు క్లైమాక్స్ ఒకెత్తు. కోలీవుడ్ సింగం సూర్యని రోలెక్స్ గా చూపించి ఆడియన్స్ కి గూస్ బంప్స్ ఇచ్చాడు లోకేష్ కనగరాజ్. రోలెక్స్ పాత్రలో సూర్య ఇచ్చిన ఎంట్రీకి థియేటర్స్ షేక్ అయ్యాయి. ఫ్యూచర్ లో విక్రమ్ అండ్ రోలెక్స్ మధ్య జరగబోయే వార్ ని తలచుకొని ఫాన్స్ పూనకాలతో ఊగిపోయారు. ఈమధ్య కాలంలో విక్రమ్ సినిమా ఇచ్చినంత విజువల్ హై ఇంకో సినిమా ఇవ్వలేదు. అందుకే ఫాన్స్ విక్రమ్ 3 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, కమల్ vs సూర్య ఎప్పుడు చూస్తాం అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి ప్రస్తుతం విజయ్ తో ‘లియో’ సినిమా చేస్తున్న లోకేష్ కనగరాజ్ విక్రమ్ 3ని ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు అనేది చూడాలి.
#1YearofVikram #Ulaganayagan #KamalHaasan #Vikram #VikramAllTimeRecord
@ikamalhaasan @Dir_Lokesh… pic.twitter.com/uP7YSU16kZ— Raaj Kamal Films International (@RKFI) June 3, 2023
