Site icon NTV Telugu

The Conjuring: మోస్ట్ హార్రిఫయ్యింగ్ ఫ్రాంచైజ్ నుంచి సినిమా వస్తోంది…

The Conjuring

The Conjuring

ఈవిల్ డెడ్ ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన సినిమాలు హారర్ జానర్ కి ఒక బెంచ్ మార్క్ ని సెట్ చేశాయి. ప్రపంచంలో ఎవరు హారర్ సినిమాలు చెయ్యాలన్నా ఈవిల్ డెడ్ సినిమాలని మించి చెయ్యడం జరగదు అనే ఇంప్రెషన్ వరల్డ్ ఫిల్మ్ లవర్స్ లో ఉంది. ఈ ఫీలింగ్ ని దాటి ఆడియన్స్ ని భయపెడుతున్న ఫ్రాంచైజ్ ‘ది కాంజురింగ్’. పారానార్మల్ యాక్టివిటీని బేస్ చేసుకోని తెరకెక్కే ఈ సినిమాలు ఆడియన్స్ ని ఈవిల్ డెడ్ మర్చిపోయేలా చేశాయి. పారా నార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ‘ఎడ్ వార్రెన్’, ‘లోర్రైన్ వార్రెన్’ లు తమ జీవితంలో ఫేస్ చేసిన, సాల్వ్ చేసిన హార్రిఫయ్యింగ్ కేసుల నుంచి ‘ది కాంజురింగ్’ సినిమాలు తెరకెక్కుతున్నాయి. ‘ఎడ్ వార్రెన్’, ‘లోర్రైన్ వార్రెన్’ల రియల్ లైఫ్ పాత్రలని రీల్ లైఫ్ లో ‘వేరా ఫార్మిగా’, ‘ప్యాట్రిక్ విల్సన్’ ప్లే చేస్తున్నారు. 2013లో వచ్చిన ‘ది కాంజురింగ్’ సినిమాతో ఈ ఫ్రాంచైజ్ మొదలయ్యింది.

ఇప్పటివరకూ ది కాంజురింగ్ యూనివర్స్ నుంచి అనబెల్లె, ది కాంజురింగ్ 2, అనబెల్లె:క్రియేషన్, ది నన్, ది కర్స్ ఆఫ్ ల లోరోన, అనబెల్లె: కమ్స్ హోమ్, ది కాంజురింగ్: ది డెవిల్ మేడ్ మీ డూ ఇట్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అన్నీ రియల్ లైఫ్ కథలు అవ్వడంతో థియేటర్ లో కూర్చోని సినిమా చూసే ఆడియన్స్ కి వెన్నులో వణుకు పుట్టడం గ్యారెంటీ. గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్, జంప్ స్కేర్స్, పారానార్మల్ యాక్టివిటీ, స్టన్నింగ్ విజువల్ ఎఫెక్ట్స్ ఈ యూనివర్స్ నుంచి వచ్చిన ప్రతి సినిమాలో ఉన్నాయి. దీంతో ది కాంజురింగ్ యూనివర్స్ కి మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఈ యూనివర్స్ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది కాంజురింగ్ 4’కి ‘ది కాంజురింగ్ లాస్ట్ రైట్స్’ అని ఫిక్స్ చేశారు. కాంజురింగ్ యూనివర్స్ నుంచి వచ్చే లాస్ట్ మూవీగా పేరు ప్రమోట్ అవుతున్న ‘ది కాంజురింగ్ లాస్ట్ రైట్స్’ సెప్టెంబర్ 8న ఆడియన్స్ ముందుకి రానుంది. మరి ఈ స్పైన్ చిల్లింగ్ హారర్ సినిమా ఆడియన్స్ ని ఏ రేంజులో ఆకట్టుకుంటుందో చూడాలి.

Exit mobile version