NTV Telugu Site icon

ది బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క‌వాయ్‌…చూసి తీరాల్సిందేనోయ్‌… ఎందుకంటే…!!

ప్ర‌పంచంలో ఇప్ప‌టి వ‌ర‌కు కొన్ని వేల సినిమాలు వ‌చ్చి ఉంటాయి.  అందులో త‌ప్ప‌కుండా చూసి తీరాల్సిన సినిమాలు కొన్ని ఉంటాయి.  అలాంటి వాటిల్లో ఒక‌టి ది బ్రిడ్డ్ ఆన్ ది రివ‌ర్ క‌వాయ్‌.  2.8 మిలియ‌న్ డాల‌ర్ల‌తో నిర్మించిన ఈ చిత్రం 1957 అక్టోబ‌ర్ 11 న యూకేలో రిలీజ్ కాగా, డిసెంబ‌ర్ 14, 1957లో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో రిలీజ్ అయింది.  దాదాపుగా 30.6 మిలియ‌న్ డాల‌ర్ల‌కు పైగా వ‌సూలు చేసింది.  వార్ బ్యాక్‌డ్రాప్ నేప‌థ్యంలో సినిమాను చిత్రీక‌రించారు.  బ‌ర్మాలోని క‌వాయ్ అనే న‌దిపై రాక‌పోక‌ల కోసం బ్రిడ్జిని నిర్మించే క్ర‌మంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.  1952లో పిర్రే బౌలీ రాసిన న‌వ‌ల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.  

Read: పవన్ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్

బ‌ర్మాలోని రివ‌ర్ కవాయ్‌పై బ్రిడ్జిని అక్క‌డ జ‌ప‌నీస్ ప్రిజ‌న్ క్యాంప్‌లో ఉన్న ఖైదీలను ఉప‌యోగించి నిర్మించాల‌ని అనుకుంటారు.  అయితే, ఈ ప్ర‌య‌త్నాల‌కు కొంత‌మంది అడ్డుత‌గులుతారు.  వంతెన నిర్మించే క్ర‌మంలో ఎలాంటి ప‌రిణామాలు ఎదుర‌య్యాయి అన్న‌ది చాలా అద్భుతంగా చిత్రీకరించారు.  ఈ సినిమా 1957లో ఏడు అకాడెమీ అవార్డులు సొంతం చేసుకుంది.  బెస్ట్ పిక్చ‌ర్‌, బెస్ట్ డెరెక్ట‌ర్‌, బెస్ట్ యాక్ట‌ర్‌, బెస్ట్ స్క్రీన్‌ప్లే ఇలా ఏడు కేట‌గిరిల్లో అవార్డును సొంతం చేసుకుంది.  20 వ శతాబ్దంలో నిర్మించిన బెస్ట్ చిత్రాల్లో ఇది 11వ బెస్ట్ చిత్ర‌మ‌ని బ్రిటీష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ పేర్కొన్న‌ది.  ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉండటం విశేషం.  నెట్‌ఫ్లిక్స్ తో పాటుగా ఈ మూవీ గూగుల్ ప్లే స్టోర్‌లోనూ, యూట్యూబ్‌లోనూ రెంట‌ల్‌కు అందుబాటులో ఉన్న‌ది.