ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ ఎప్పుడు క్లిక్ అవుతుందో చెప్పడం కష్టం. ఒక్క సినిమాతో బ్రేక్ ఇచ్చి ఓవర్ నైట్ స్టార్ బ్యూటీలుగా మారిపోతున్నారు. అందులో ఒకరు బ్యూటీ మమితా బైజు. ప్రేమలుతో యూత్ హార్ట్ థ్రోబ్ హీరోయిన్‌గా మారిన స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ కొల్లగొట్టింది. సాధారణంగా మలయాళ అమ్మాయిలు టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి క్రష్ బ్యూటీలుగా మారిపోతుంటారు. కానీ మమితా బైజు ‘ప్రేమలు’ లాంటి డబ్బింగ్ చిత్రంతో రాత్రికి రాత్రే స్టార్ డమ్ సంపాదించుకుంది. తన అమాయకమైన నటనతో యూత్ మనస్సు దోచేసింది.
Also Read : Abhishek Bachchan : ఓటీటీలో అదరగొడుతున్న అభిషేక్ బచ్చన్..
దాంతో ఈ కేరళ కుట్టీకి అటు మలయాళం ఇటు తమిళ్, తెలుగులో వరుస ఆఫర్లు క్యూ కాట్టాయి. మమితా మలయాళంలో 15 సినిమాలు చేసినా రాని లక్ ప్రేమలుతో దక్కడంతో దాన్ని క్యాష్ చేసుకుని పనిలో బిజీ అయ్యింది. ప్రేమలు తర్వాత మంచి ఆఫర్స్ వస్తాయని ఊహించింది. కానీ ఏకంగా స్టార్ హీరోలైన విజయ్ దళపతి, సూర్యలతో నటించే గోల్డెన్ ఛాన్స్ వస్తుందని ఊహించలేదు. విజయ్ జననాయగన్ లో విజయ్ కూతురుగా నటిస్తుండగా, సూర్య 46లో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కోలీవుడ్ మరోక సెన్సేషనల్ హీరో ప్రదీప్ రంగనాథ్‌తో డ్యూడ్ లోను నటిస్తోంది. ఇక ఇప్పటికే కంప్లీటైన ఇరండు వానం రిలీజ్‌కు రెడీ అయ్యింది. రీసెంట్లీ తన బెస్ట్ ఫ్రెండ్ ప్రేమలులో అమూల్ డెవిస్ క్యారెక్టర్ చేసిన సంగీత్ ప్రతాప్‌తో జోడీ కడుతోంది భామ. అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీగా ఈ సినిమా రాబోతుంది. ఇక మలయాళం కన్నా తమిళంలో బిజీగా మారిన మమితా బైజు త్వరలో తెలుగులో కూడా బిజీగా అడుపెట్టేందుకు రెడీ అవుతోంది.
