NTV Telugu Site icon

Venkatesh: వెంకీమామ… నువ్వు కూడా ఇలాంటి పని చేస్తావనుకోలేదు…

Venky

Venky

Venkatesh: వెంకటేష్.. ఈ పేరు వినగానే సంక్రాంతి, సూర్యవంశం, వసంతం, దృశ్యం ఇలాంటి సినిమాలు మైండ్ లో మెదులుతూ ఉంటాయి. ఎటువంటి విమర్శలు లేని, ఫ్యాన్స్ వార్స్ లేని.. అందరికి నచ్చిన ఏకైక హీరో వెంకటేష్. వెంకీ మామ అని అన్ని ఇండస్ట్రీలు ముద్దుగా పిలుచుకునే వెంకీ సినిమా అంటే అందరి కంటే ముందు మహిళలు ముందుఉంటారు. ఇక అలాంటి హీరో మొట్టమొదటిసారి ఒక వెబ్ సిరీస్ తీస్తున్నాడు అంటే.. అభిమానులు టీవీలు వదులుతారా..? అదే జరిగింది. కానీ, ఈ సిరీస్ చూశాకా మొదటిసారి మహిళలు వెంకీ మామపై విమర్శలు గుప్పిస్తున్నారు. రానా, వెంకటేష్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన సిరీస్ రానా నాయుడు. ఈ నెల 10 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ సిరీస్. మొదటి నుంచి మేకర్స్ ఒక విషయాన్నీ చెప్పుకొంటూ వస్తున్నారు. దయచేసి కుటుంబంతో కలిసి ఈ సిరీస్ ను చూడొద్దని వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే ఆ బాలీవుడ్ మేకర్స్ కు తెలియని విషయం ఏంటంటే.. వెంకీ మామ ఫోటో కనిపించగానే.. అభిమానులు ముందు వెనుక ఆలోచించకుండా ఓపెన్ చేసేస్తారు. అది ఆయన రేంజ్.

Allu Arjun: ఆర్ఆర్ఆర్ పై బన్నీ ప్రశంసల వర్షం.. అందరి చూపు ఆ ఒక్క మాటమీదే

అడల్ట్ కంటెంట్ కు ఆమడ దూరంలో ఉండే వెంకీ.. సిరీస్ మొత్తం అదే కంటెంట్ చేశాడని వారు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. రానా, వెంకీ నటించిన తొలి సిరీస్, వెంకీ న్యూ లుక్.. నెట్ ఫ్లిక్స్.. సిరీస్ ను అదరగొట్టేసుంటారు అనుకోని చూసిన ప్రేక్షకుడుకు బూతులు,స్ శృతిమించిన శృంగారం తప్ప ఏమి కనిపించదు. ముఖ్యంగా వెంకీ బూతులు మాట్లాడం అనేది అసలు అభిమానులు ఉహించుకోలేకపోతున్నారు. వెంకీ చాలా డిఫరెంట్ రోల్ అని ఈ సిరీస్ ను ఒప్పుకొని ఉండొచ్చు. కానీ, అభిమానులు ఒక్కసారిగా ఈ రేంజ్ వెంకీని చూసి తట్టుకోవడం మాత్రం కష్టమే అని చెప్పుకొస్తున్నారు. ఛీఛీ.. వెంకీమామను జీవితంలో ఇలా చూస్తామనుకోలేదు అని కొందరు.. నువ్వు కూడా ఇలాంటి అడల్ట్ సిరీస్ చేస్తావనుకోలేదు అని సగటు అభిమానులు మొదటిసారి వెంకీని అనడం మాత్రం ఎంతో ఆవేదనకు గురిచేసేస్తోందని చెప్పొచ్చు. ఈ సిరీస్ చూసాక వెంకీని అభిమానులు కోరేది ఒకటే.. దయచేసి ఇలాంటి కథలను ఒప్పుకొనేముందు మీ అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అలోచించి కథలను ఎంచుకోండి అని.. మరి వెంకీ వీటిపై ఎలా స్పందిస్తాడో చూడాలి.

Show comments