మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ పెద్ది. . ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లగా సాంగ్స్ ఏకంగా వందల మిలియన్ వ్యూస్ తో అంచలనాలు స్కై లెవల్ కు తీసుకువెళ్లాయి.
కాగా మరొక గుడ్ న్యూస్ తో ఫ్యాన్స్ లో జోష్ పెంచారు మేకర్స్. పెద్ది పాన్ ఇండియా తో పాటు ఓవర్సీస్ లోను భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద తన ప్రతాపాన్ని చూపించడానికి సిద్ధమైంది. అందుకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అధికారికంగా ప్రారంభమయ్యాయి. బుకింగ్స్ ఓపెన్ చేసిన 30నిమిషాల్లో $50K+ ప్రీమియర్ సేల్స్ కలెక్ట్ చేసి దూసుకెళ్తోంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిర సినిమాస్ఈ చిత్రాన్ని ఓవర్సీస్ లో భారీ స్థాయిలో విడుదల చేస్తోంది. జూన్ 3వ తేదీన నార్త్ అమెరికా అంతటా గ్రాండ్ ప్రీమియర్ షోలు ప్రదర్శితం కానున్నాయి. 1980ల నాటి గ్రామీణ ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో సాగే పీరియడ్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. ఇందులో రామ్ చరణ్ ఒక విభిన్నమైన లుక్‌లో ‘పెహిల్వాన్’గా కనిపించనున్నారు. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం మరియు ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ ఈ చిత్రాన్ని జూన్ 4న భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది.
