NTV Telugu Site icon

Dhwani : పదేళ్ళకే షార్ట్ ఫిలిం డైరెక్ట్ చేసిన బుడతడు.. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు!

Lakshnin

Lakshnin

10-year-old Lakshin has directed ‘Dhwani’ short film: పదేళ్ళ కుర్రాడు అంటే హ్యాపీగా స్నేహితులతో ఆడుకుంటూ ఉంటాడు అనుకుంటాం కానీ ఏకంగా ఒక షార్ట్ ఫిలిం డైరెక్ట్ చేసి అందరిన్నీ ఆశ్చర్య పరిచాడు ఒక బుడతడు. అసలు వివరాల్లోకి వెళితే పదేళ్ళ లక్షిన్ డెఫ్ అండ్ డంబ్ నేపధ్యంలో ధ్వని అనే షార్ట్ ఫిలిం తెరకెక్కించాడు. ఎల్.వి ప్రొడక్షన్ బ్యానర్ లో లక్షిన్ దర్శకత్వం వహించిన ధ్వని షార్ట్ ఫిలింకి నీలిమ వేముల నిర్మాతగా వ్యవహరించగా అశ్విన్ కురమన సంగీతం అందించారు. ఇక ఈ ధ్వని షార్ట్ ఫిలిం రిలీజ్ కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహించగా ఈ వేడుకకు నిర్మాత బెల్లంకొండ సురేష్, తుమ్మల రామ సత్యనారాయణ, దర్శకులు కరుణ కుమార్, జ్యోతి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Hidimba: ఓంకార్ తమ్ముడి ‘హిడింబ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

ఈ కార్యక్రమంలో లక్షిన్ కు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు కూడా నమోదు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక మరో ఆసక్తికరమిన విషయం ఏమిటంటే పది ఏళ్ల లక్షిన్ ఇరవై ఏళ్లలోపు ఇరవై ఫిలిమ్స్ చేయాలనేది అనేది లక్ష్యం అని చెబుతున్నారు. ఈ సందర్భంగా చిన్ని డైరెక్టర్ లక్షిన్ మాట్లాడుతూ ధ్వని షార్ట్ ఫిలిం చెయ్యడానికి నన్ను ఎంకరేజ్ చేసిన పేరెంట్స్ కు థాంక్స్ చెప్పాడు. చిన్న కాన్సెప్ట్ తో తీసిన ఈ షార్ట్ ఫిలింకు అందరి నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తుందని చెబుతూనే దర్శకుడిగా మంచి సినిమాలు చేయాలి అనేది నా కోరిక అని చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులో నా ఫేవరేట్ హీరో అల్లు అర్జున్ తో మూవీ చేయాలనేది నా డ్రీమ్ అని లక్షిన్ వెల్లడించారు.