Site icon NTV Telugu

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ లో ఉన్న ఏకైక బ్యాడ్ క్వాలిటీ అదే .. ?

Pawan

Pawan

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో మందికి దేవుడు.. మరెంతో మందికి శత్రువు. ఆయనను ప్రేమించేవారు ఎంత మంది ఉన్నారో.. ఆయనను విమర్శించేవారు అంతేముంది ఉన్నారు. ఇక రాజకీయాల్లోకి వచ్చాకా ఆ విమర్శలు మరింత ఎక్కువ అయ్యాయి. మొదటి నుంచి ఇప్పటివరకు చూసుకుంటే .. పవన్ లో ఎంతో కొంత మార్పు వచ్చింది. ఒకప్పుడు ఎవరు ఎన్ని విధాలుగా మాటల్తో తూటాలు పొడిచినా మిన్నగున్న మనిషి.. ఈ మధ్య ఎంతటివారికైనా తనదైన రీతిలో సమాధానమిస్తున్నాడు. అందరు ఎదురుగా ఉండి మాట్లాడింది వేర.. ఎవరు లేనప్పుడు మాట్లాడింది వేరు. కానీ, పవన్ రెండిటి దగ్గర ఒకేలా మాట్లాడతాడు అని పవన్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.. పవన్ ఎంత దేవుడిగా కొలిచినా ఆయనలో ఉన్న చెడ్డ గుణమే.. జాలి, దయ అని చెప్పుకొస్తున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదని ఉదాహరణలు చెప్పుకొస్తున్నారు.

Anupama Parameswaran: చివరికి నువ్వు కూడానా.. అనుపమ.. తట్టుకోలేకపోతున్నామే

బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తన్న అన్ స్టాపబుల్ షోకు వెళ్లిన పవన్.. రాజకీయాల గురించి కూడా మాట్లాడాడు. మూడు పెళ్లిల గురించి ట్రోల్స్ చేస్తుంటారు.. అలాంటప్పుడు మీకు ఏం అనిపించదా..? అని పవన్ ను అడిగినప్పుడు.. “నాకు తెలిసిన ఆ విషయం తప్ప నన్ను విమర్శించడానికి వారి దగ్గర ఏది లేదు. విమర్శించినంత వరకు విమర్శించనివ్వండి.. అది మాత్రమే వారికి తెల్సింది. నేను కావాలని చేసిన తప్పు కాదు.,. అది అలా జరిగిపోయింది” అంటూ సమాధానము చెప్పుకొచ్చాడు. తనను అనరాని మాటలు అన్నా కూడా పోనిలే.. అని వదిలేయడం, గుడ్డిగా దగ్గర ఉన్నవారిని నమ్మడం చాలా మంచిది కాదని, ముఖ్యంగా రాజకీయాల్లో సొంతవారిని కూడా అనుమానించాలని అలాంటి గుణం పవన్ లో లేదని చెప్పుకొస్తున్నారు. జాలి దయ అనే బ్యాడ్ క్వాలిటీస్ పవన్ లో ఉండడం వలనే ఇంకా పూర్తి రాజకీయ నాయకుడిగా మారలేదని అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది పక్కన పెడితే.. పవన్ పై అభిమానం మాత్రం వారు ఈ విధంగా చూపిస్తున్నారు అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ఇక ఇంకొందరు ఇలా మాటలు చెప్పడం కాదు ఓటు వేసి గెలిపించి ఇలాంటి నీతులు చెప్పండి అని చెప్పుకొస్తున్నారు.

Exit mobile version