టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లో సుకుమార్ ఒకరు. ఇప్పటికే మంచి మంచి సినిమాలకు దర్శకత్వం వహించి సుకుమార్, అల్లు అర్జున్ తో ‘పుష్ప’,‘పుష్ప 2’ మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘పుష్ప 2’ సినిమా అయితే ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పవచ్చు. ఇటీవల విడుదలైన ఈ మూవీ రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించి రికార్డు సృష్టించింది. అయితే ఇండస్ట్రీలో ప్రతి ఒక్క నటీనటులకు, స్పూర్తిగా ఎవరో ఒక్కరు ఉంటారు. అలా సుకుమార్ కి కూడా ఒక హీరో వలన ఇండస్ట్రీలో ఏదైనా చేయగలననే నమ్మకం కలిగిందట. ఇంతకీ ఎవరా హీరో అసలు ఏం జరిగింది ఆయన మాటల్లోనే విదాం.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుకుమార్ తన జీవితంలో అతి ముఖ్యమైన విషయాలను పంచుకున్నాడు. సుకుమార్ మాట్లాడు.. ‘ నేను హీరో రాజశేఖర్ కి వీరాభిమాని. ఆయన నటించిన అంకుశం, ఆహుతి, ఆగ్రహం, తలంబ్రాలు, మగాడు, తదితర చిత్రాలు నన్నెంతో ప్రభావితం చేశాయి. రాజశేఖర్ మూవీ రిలీజ్ అయింది అంటే చాలా థీయెటర్ లో నేనే ముందు ఉండే వాడిని. చదువుకొనే రోజుల్లో నేను ఆయన్ను బాగా ఇమిటేట్ చేస్తుండేవాని. నా పెర్ఫామెన్స్ నచ్చి అందరూ వన్స్‌మోర్ అనేవారు. నాకు చాలా మంది ఫ్యాన్స్ కూడా అయ్యారు. దీంతో సినిమాల్లోకి వెళ్లితే ఏదైనా చేయగలననే నమ్మకం రాజశేఖర్ వల్ల కలిగింది’ అని చెప్పుకొచ్చారు సుకుమార్. ఈ సందర్భంగా ఆయన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.