Keedaa Cola Trailer Review: పెళ్ళిచూపులు, ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ నటించి, డైరెక్ట్ చేసిన మూవీ ‘కీడా కోలా’. క్రైమ్ కామెడీ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో బ్రహ్మానందం, రఘురామ్, రాగ్ మయూర్, చైతన్య రావు, రవీంద్ర విజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను తరుణ్ భాస్కర్ స్నేహితులు కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీసాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేయగా ఇద్దరు ప్రధాన పాత్రధారులలైన చైతన్య రావు, రాగ్ మయూర్ కు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండటం అదే సమయానికి కూల్ డ్రింక్ లో ఉన్న బొద్దింక వాళ్ల కంటపడటంతో దానితో కోట్లు సంపాదించాలనే అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
Siddhu Jonnalagadda: అయ్యప్పమాలలో సిద్దు జొన్నలగడ్డ.. న్యూ లుక్ వైరల్..
చైతన్య రావు .. రాగ్ మయూర్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, తరుణ్ భాస్కర్ ఒక కీలకమైన పాత్రను పోషించగా జీవన్, విష్ణు వంటి వారు ఇతర పాత్రల్లో నటించారు. ఇక వివేక్ సాగర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను, రానా సమర్పిస్తూ ఉండగా సినిమా మీద ఈ ట్రైలర్ ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. 8 పాత్రల చుట్టూ తిరిగే ఈ కథలో బాస్ నాయుడు అనే కీలకపాత్రలో తరుణ్ భాస్కర్ కనిపించాడు. కోటి విలువ చేసే ఒక బొమ్మ, కోర్టు డ్రామా, కోలాలో బొద్దింక, కార్పొరేటర్ పదవి కోసం పోటీ పడే ఇద్దరు వ్యక్తులు ఒకరకంగా చూస్తే ఈ ట్రైలర్ లో ప్రేక్షకులను ఆకట్టుకునేలా తన మార్క్ తెలంగాణ డైలాగులు అందించాడు. నవంబర్ 3న కీడా కోలా మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోండగా అందరి దృష్టి సినిమా మీదనే ఉన్నది.