Site icon NTV Telugu

Tharun Bhascker: పాన్ ఇండియా మూవీ ‘కీడా కోలా’ మొదలైంది.

Suresh Pp

Suresh Pp

 

తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లిచూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తరుణ్ భాస్కర్ దాస్యం. అంతేకాదు… అవకాశం చిక్కినప్పుడల్లా వెండితెరపై నటుడిగానూ మెరిసిపోతున్నాడు. తాజాగా తరుణ్ భాస్కర్ సరికొత్త క్రైమ్ కామెడీ మూవీ ‘కీడా కోలా’ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు.

విజి సైన్మా బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1 గా తెరకెక్కబోతోన్న ఈ చిత్రం షూటింగ్ మంగళవారం గ్రాండ్ గా మొదలైంది. ఈ ఈవెంట్ లో నిర్మాత సురేష్ బాబు, హీరోలు సిద్ధార్థ్, తేజ సజ్జా, నందుతో పాటు పలువురు యువ దర్శకులు హాజరై చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెస్ తెలిపారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. శ్రీపాద్ నందిరాజ్, సాయికృష్ణ గద్వాల్, ఉపేంద్ర వర్మ, వివేక్ సుధాంషు, కౌశిక్ నండూరి నిర్మిస్తున్న ‘కీడా కోలా’ 2023 లో పాన్ ఇండియా థియేట్రికల్ రిలీజ్ కానుంది.

Exit mobile version