Thangalaan: చియాన్ విక్రమ్, మాళవిక మోహనన్ జంటగా పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తంగలాన్. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫ్యాక్టరీలోని తమిళ కార్మికుల జీవితాల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెంచాయి. ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక దీంతో ఈ సినిమా మరి కొన్నిరోజుల్లో రిలీజ్ అవుతుంది అనుకొనేలోపు.. ఈ సినిమా వాయిదా పడినట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఇక ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు. ఎడారిలో విక్రమ్.. మోకాలు వంచి కూర్చొని యుద్దానికి సిద్ధం అన్నట్లు సీరియస్ లుక్ లో కనిపించాడు.
ఇక ఏప్రిల్ అంటే.. అదే నెలలో దేవర రిలీజ్ అవుతుంది. ఏప్రిల్ 5 న దేవర మొదటి భాగం రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఏప్రిల్ లో వేరే పెద్ద సినిమాలు ఏవి లేవు. తంగలాన్.. రిలీజ్ డేట్ ను చెప్పలేదు కానీ, ఏప్రిల్ లో ఉంటుంది అని తెలిపింది. మరి ఈ సినిమా దేవరకు పోటీగా ఉంటుందా.. ? లేదా.. ? అనేది తెలియాలి. ఇకపోతే ఇప్పటికే విక్రమ్ నటించిన ధృవ నక్షత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న విషయం తెల్సిందే. ఇప్పుడు ఈ సినిమా కూడా వాయిదా అంటే విక్రం అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
