Thandel Regular Shoot Begins Today In Udupi: యువ సామ్రాట్ నాగ చైతన్య, సక్సెస్ ఫుల్ దర్శకుడు చందూ మొండేటి, ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న హై బడ్జెట్ పాన్ ఇండియన్ మూవీ ‘తండేల్’ కొద్ది రోజుల క్రితం గ్రాండ్ గా లాంచ్ అయింది. ఇక ఎట్టకేలకు ఈ రోజు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉడిపిలో ప్రారంభమైంది. నాగ చైతన్య, సాయి పల్లవి సహా యాక్టర్స్ అందరూ పాల్గొంటున్న ఈ కీలక షెడ్యూల్ లో చిత్ర యూనిట్ టాకీ, యాక్షన్ పార్ట్‌ను చిత్రీకరిస్తుందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలోని మల్పే పోర్ట్ (ఉడిపి)లో జరుగుతోంది, నాగ చైతన్యతో పాటు ఫైటర్స్ పై యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నారు. నాగ చైతన్య ఈ సినిమాలో మత్స్యకారునిగా నటించడానికి బీస్ట్ మోడ్ లోకి మారారన్న సంగతి తెలిసిందే.
Salaar Movie: సలార్ సీక్రెట్స్ బయటపెట్టిన నిర్మాత.. ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ
కండలు తిరిగిన దేహం కోసం గత కొన్ని నెలలుగా చాలా హార్డ్ వర్క్ చేశారు చైతూ. ఈ క్రమంలో ఈ సినిమాలో ఆయన పొడవాటి జుట్టు, గడ్డంతో రగ్గడ్ లుక్ లో కనిపిస్తారు. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోండగా ఈ ‘తండేల్’ పూర్తిగా భిన్నమైన నేపథ్యంలో సాగే ప్రేమకథ అని అంటున్నారు. అత్యున్నత సాంకేతిక నిపుణులను పని చేస్తున్న ఈ చిత్రానికి కథలో సంగీతానికి మంచి స్కోప్ ఉన్నందున, జాతీయ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తన సౌండ్‌ట్రాక్‌లు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ప్రేమకథను అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమాను ఒక విజువల్ వండర్ గా మార్చి ప్రేక్షకులకు అందించడానికి షామ్‌దత్ కెమెరామ్యాన్ గా పని చేస్తున్నారు. ఆర్ట్ విభాగాన్ని నాగేంద్ర తంగాల పర్యవేక్షిస్తున్నారు.