Thandel: అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తండేల్. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. గత కొన్నేళ్లుగా విజయం కోసం నాగచైతన్య ఎంతో కష్టపడుతున్న విషయం తెలిసిందే.. ఈ మధ్యనే దూత వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చి అక్కడ విజయాన్ని అందుకున్నాడు చై. ప్రస్తుతం అతని ఆశలన్నీ ఈ సినిమా మీదనే పెట్టుకున్నాడు. ఈ చిత్రంలో చైతన్య బోట్ నడిపే వాడిగా కనిపించనున్నాడు. గుజరాత్ తీరంలో సముద్ర జలాల్లో చిక్కుకున్న శ్రీకాకుళానికి చెందిన జాలరి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆధారంగా ఈ సినిమాను చందు మొండేటి తెరకెక్కించనున్నాడు.
ఇప్పటివరకు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను శరవేగంగా పూర్తిచేసిన మేకర్స్.. ఎట్టకేలకు సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి ముహూర్తం ఖరారు చేశారు. రేపు అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉదయం 10.30 గంటలకు పూజా కార్యక్రమంతో ఘనంగా ఈ సినిమా మొదలుకానుంది. ఇక ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా అక్కినేని, దగ్గుబాటి హీరోలు విచ్చేస్తున్నారు. చైతన్య తండ్రి అక్కినేని నాగార్జున, చైతన్య మేనమామ దగ్గుబాటి వెంకటేష్.. ఈ పూజా కార్యక్రమానికి విచ్చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. దీంతో ఒకే వేదికపై వెంకీ మామ, నాగ్ సందడి చేయనున్నారని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. చై మొట్ట మొదటి పాన్ ఇండియా సినిమా తండేల్. మరి ఈ సినిమాతో చై ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Setting sail to the adventurous voyage ⛵#Thandel Muhurtham Ceremony on Dec 9th from 10.30 AM onwards at the Glass House, Annapurna Studios ❤️
Victory @VenkyMama Garu & King @iamnagarjuna Garu will grace the ceremony and bless the team ❤️🔥#Dhullakotteyala 🔥
Yuvasamrat… pic.twitter.com/KwIE0mdxue— Geetha Arts (@GeethaArts) December 8, 2023
