సందీప్ రెడ్డి వంగ, రణబీర్ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా అనిమల్. డిసెంబర్ 1న రిలీజైన ఈ మూవీ వరల్డ్ వైడ్ సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో హయ్యెస్ట్ హిందీ గ్రాసర్ గా నిలిచిన అనిమల్ సినిమా సౌత్ స్టేట్స్ లో కూడా సాలిడ్ గా బిజినెస్ చేసింది. A రేటెడ్ సర్టిఫికేట్, మూడున్నర గంటల నిడివి కూడా అనిమల్ సినిమాని బ్లాక్ బస్టర్ అవ్వకుండా ఆపలేకపోయాయి. హ్యూజ్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చూపించిన అనిమల్ సినిమా థియేట్రికల్ రన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది. కొత్త సినిమాల విడుదలతో అనిమల్ థియేటర్స్ తగ్గిపోయి, రెవెన్యూ రావడం ఆగిపోయింది. సో ఇప్పటివరకూ అనిమల్ సినిమా దాదాపు 900 కోట్ల వరకూ రాబట్టింది. ఇది 2023 బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి అవ్వగా, రణబీర్ కపూర్ కి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
అనిమల్ సినిమా హిట్ అవుతుంది అనుకున్నారు కానీ ఈ రేంజ్ హిట్ అవుతుందని ఎవరూ అనుకోలేదు. దీంతో థియేట్రికల్ రన్ కంప్లీట్ అయిపోయిన అనిమల్ సినిమా సక్సస్ మీట్ కి చిత్ర యూనిట్ గ్రాండ్ గా చేసుకున్నారు. సందీప్, రణబీర్, బాబీ డియోల్, రష్మిక… ఇతర కాస్ట్ అండ్ క్రూ కలిసి చేసుకున్న ఈ గ్రాండ్ పార్టీలో తమన్నా హైలైట్ గా నిలిచింది. పేరుకే అనిమల్ పార్టీ కానీ ట్రెండ్ అవుతుంది మాత్రం మిల్కీ బ్యూటీనే. ఈ సక్సస్ మీట్ కి కాస్త హాట్ గానే వచ్చిన తమన్నా ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల దెబ్బకి అనిమల్ సినిమాలో అంత మంది అమ్మాయిలు ఉన్నా కూడా కనిపించకుండా పోయారు. సింపుల్ గా చెప్పాలి అంటే అనిమల్ సక్సస్ మీట్ కారణంగా తమన్నా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.
