Site icon NTV Telugu

‘అల మెగా కాంపౌండులో…’ థమన్!

థమన్… ప్రస్తుతం టాలీవుడ్ లో అందరికంటే జోరుమీదున్న సంగీత దర్శకుడు! అంతే కాదు, థమన్ రైట్ నౌ… తన జోరుకి మెగా జోష్ ను కూడా యాడ్ చేస్తున్నాడు! ‘అల వైకుంఠపురములో’ రూపంలో ఇప్పటికే మెగా కాంపౌండ్ హీరో అల్లు అర్జున్ కి భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఆ తరువాత ‘వకీల్ సాబ్’ సినిమాతో పవన్ కళ్యాణ్ కి కూడా సూపర్ హిట్ ఇచ్చాడు. మరి వాట్ నెక్ట్స్? మరో నాలుగు మెగా ప్రాజెక్ట్స్ తో బిజిబిజీగా ఉన్నాడు థమన్… చిరంజీవి హీరోగా తెరకెక్కే ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ పై ఇప్పటికే చాలా ప్రచారం జరిగింది. అయితే, మెగా మూవీకి ట్యూన్స్ కడుతున్నట్టు ఆ మధ్య థమన్ స్వయంగా సొషల్ మీడియాలో ప్రకటించాడు. మరో మలయాళ రీమేక్ ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ తెలుగు వర్షన్ కి కూడా థమనే సంగీత దర్శకుడు!

అందులో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి నటిస్తున్న విషయం తెలిసిందే! ఇక ‘లూసిఫర్, అయ్యప్పనుమ్ కోశియమ్’ తెలుగు రీమేక్స్ తరువాత… థమన్ స్వరాలు అందిస్తోన్న మూడో మెగా మూవీ శంకర్, రామ్ చరణ్ క్రేజీ ప్రాజెక్ట్! డైరెక్టర్ శంకర్ తో మెగా పవర్ స్టార్ చేయనున్న సినిమాలోనూ థమన్ పాటలే మార్మోగనున్నాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, థమన్ మెగా సినిమాల్లో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది, వరుణ్ తేజ్ ‘గనీ’ మూవీ! బాక్సింగ్ నేపథ్యంలో వస్తోన్న స్పోర్ట్స్ డ్రామాకి సైతం థమన్ ట్యూన్స్ యాడెడ్ అట్రాక్షన్ అవ్వనున్నాయి… మెగా కాంపౌండ్ కి బయట థమన్ స్వరాలు సమకూరుస్తోన్న చిత్రాల్లో మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’, అఖిల్ ‘ఏజెంట్’, విశాల్ ‘ఎనీమీ’ సినిమాలు ఉన్నాయి. మొత్తంగా రాబోయే రోజుల్లో ఎక్కడ చూసినా థమన్ మెగా సాంగ్స్ మార్మోగటమైతే ఖాయంగానే కనిపిస్తోంది!

Exit mobile version