NTV Telugu Site icon

Beast Twitter Talk : మూవీ ఎలా ఉందంటే ?

Beast

Beast

తలపతి విజయ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం “బీస్ట్” ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అంటే ఏప్రిల్ 13న థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే “బీస్ట్” ఫస్ట్ డే ఫస్ట్ షోను వీక్షించిన విజయ్ డైహార్డ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సినిమాపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఊహించినట్లుగానే ఈ హైజాక్ డ్రామాకు ఫ్యాన్స్ నుంచి మంచి స్పందనే వస్తోంది. సినిమా కథాంశం, సంభాషణలు, స్క్రీన్‌ప్లే, కామెడీ, నటీనటుల పర్ఫార్మెన్స్ బాగున్నాయంటూ ట్వీట్ల వర్షం మొదలైంది. విజయ్ నుంచి పూజా హెగ్డే, సెల్వరాఘవన్ వరకు ప్రతి ఒక్కరూ మెప్పించదగిన పాత్రలు పోషించారని అంటున్నారు. విజయ్ చేసిన యాక్షన్ సన్నివేశాలు, కామెడీ టైమింగ్ హైలెట్స్. మొత్తం మీద అభిమానులు విజయ్ నుంచి ఆశించే యాక్షన్, థ్రిల్లింగ్, కామెడీ, రొమాన్స్‌ కలగలిపి ఈ మూవీ పూర్తి బ్లాక్‌బస్టర్ ప్యాకేజీ అని అంటున్నారు. అయితే ఇది అభిమానుల వెర్షన్… మరి విమర్శకులు సినిమాపై ఎలా స్పందిస్తారో తెలియాలంటే “బీస్ట్” రివ్యూ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.

Read Also : Beast : ఫస్ట్ డే ఫస్ట్ షోలో సెలెబ్రిటీలు… పిక్స్ వైరల్

“బీస్ట్” చిత్రానికి నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో విజయ్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా, సెల్వరాఘవన్, యోగి బాబు, రెడిన్ కింగ్స్లీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకుర్చారు. ఈ మెగా ప్రాజెక్ట్‌ని కళానిధి మారన్ సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు.

Show comments