Site icon NTV Telugu

Varasudu: ఒటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది, అక్కడ కూడా ‘బాలయ్య’తో పోటీనే…

Varasudu

Varasudu

దళపతి విజయ్ హీరోగా, వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన సినిమా ‘వారసుడు’. తమిళనాడులో ‘వారిసు’గా రిలీజ అయిన ఈ మూవీని దిల్ రాజు ప్రొడ్యూస్ చేశాడు. మన స్టార్ ప్రొడ్యూసర్ తమిళ్ లో నిర్మించిన చేసిన ఈ ఫస్ట్ సినిమాతోనే సిక్సర్ కొట్టాడు. వారిసు, వారసుడు సినిమా ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి వచ్చి 300 కోట్లు రాబట్టింది. మాస్ సినిమాలు చేసి హిట్స్ కొట్టే విజయ్ కి ఫ్యామిలీ ఓరియెంటెడ్ కథ హిట్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు వంశీ పైడిపల్లి. విజయ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన విజయ్, మరోసారి వంశీ పైడిపల్లితో వర్క్ చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. తల అజిత్ నటించిన ‘తునివు’ సినిమా పోటీగా ఉన్నా వారిసు సినిమా బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టింది. థియేట్రికల్ రన్ ని ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఒటీటీలోకి వచ్చేస్తుంది అంటూ మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు.

ఫిబ్రవరి 22న వారిసు/వారసుడు సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతుంది చూసి ఎంజాయ్ చెయ్యండి అంటూ అనౌన్స్మెంట్ వచ్చేసింది. తమిళ్, తెలుగు, మలయాళ భాషల్లో వారిసు సినిమా స్ట్రీమ్ అవ్వనుంది. వారిసు స్ట్రీమ్ అయిన రోజు సాయంత్రమే బాలయ్య నటించిన వీర సింహా రెడ్డి సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవనుంది. ఫిబ్రవరి 23న వీర సింహా రెడ్డి ఒటీటీ స్ట్రీమింగ్ కి షెడ్యూల్ కి రెడీ అయ్యి ఉంది కానీ ఈ మధ్య ముందు రోజు సాయంత్రమో, రాత్రి 9 తర్వాతనో స్ట్రీం చేసేస్తున్నారు. సో థియేటర్స్ దగ్గర పోటీ పడిన వారిసు-వీర సింహా రెడ్డి సినిమాలు ఇప్పుడు ఒటీటీలో కూడా పోటీ పడనున్నాయి. ఈ రెండు సినిమాలు స్ట్రీమ్ అయిన వారానికే చిరు ‘వాల్తేరు వీరయ్య’గా నెట్ ఫ్లిక్స్ లో దర్శనం ఇవ్వనున్నాడు.

Exit mobile version