తెలుగులో మెగా vs నందమూరి ఫ్యాన్ వార్స్, మహేశ్ బాబు vs అల్లు అర్జున్ ఫ్యాన్ వార్స్ ఎలా ఉంటాయో అంతకు మించి అనేలా తమిళ సూపర్ స్టార్ అజిత్, విజయ్ ల ఫ్యాన్ వార్స్ ఉంటాయి. మా హీరో గోప్ప్ అంటే కాదు మా హీరోనే గొప్ప అనుకునే దగ్గర నుంచి ఫ్యామిలీలని లాగుతూ తిట్టుకునే వరకూ, అవకాశం ఉంటే కొట్టుకునే వరకూ ఈ ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉంటాయి. ఆన్ లైన్, ఆఫ్ లైన్ అనే తేడా లేకుండా జరిగే అజిత్-విజయ్ ఫ్యాన్ వార్స్ ఒక్కోసారి తారస్థాయికి చేరుతాయి. అకేషన్ లేకుండానే సోషల్ మీడియాలో నెగటివ్ ట్రెండ్ చెయ్యడం ఈ ఇద్దరు హీరోలకి బాగా అలవాటైన పని. ఇక బాక్సాఫీస్ దగ్గర అజిత్-విజయ్ సినిమాలు క్లాష్ అవుతున్నాయి అంటే చాలు జరగబోయే ఫ్యాన్ వార్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అజిత్-విజయ్ లు ఎప్పటికప్పుడు ఫాన్స్ వార్ గురించి ఆపేయమని చెప్తూనే ఉన్నా అభిమానులు మాత్రం కలెక్షన్స్ దగ్గర నుంచి యుట్యూబ్ వ్యూస్ వరకూ ప్రతి విషయంలో గొడవ పడుతూనే ఉంటారు.
మూడు దశాబ్దాలుగా జరుగుతున్న ఈ ఫ్యాన్ వార్ ఎండ్ కార్డ్ పడుతుందా అంటే అవుననే సమాధానం కొన్ని వర్గాల్లో వినిపిస్తోంది. ఇందుకు కారణం అజిత్ ఇంటికి వెళ్లి మరీ విజయ్ అజిత్ ని కలవడమే. అజిత్ తండ్రి ‘మణి’ ఇటివలే మరణించారు. ఈ సమయంలో కాశ్మీర్ లో లియో సినిమా షూటింగ్ లో ఉన్న విజయ్, మార్చ్ 24న చెన్నై నుంచి రాగానే నేరుగా అజిత్ ఇంటికి వెళ్లి తన కండోలెన్సేస్ తెలియజేసాడని సమాచారం. ప్రొఫెషనల్ రైవల్రీ ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టి విజయ్ అజిత్ ఇంటికి వెళ్ళడంతో ఒక కొందరు అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అజిత్-విజయ్ ల కలయిక ఫ్యాన్ వార్స్ కి ఎండ్ కార్డ్ వేస్తుందని కోలీవుడ్ వర్గాలు ఆశిస్తున్నాయి. హీరోలైతే ఆ దిశాగా ఒక ప్రయత్నం చేశారు మరి అభిమానులు ఏం చేస్తారో చూడాలి. మూడు దశాబ్దాలుగా టాప్ హీరోస్ గా బాక్సాఫీస్ దగ్గర పడుతున్న అజిత్, విజయ్ లు 1995లో రిలీజ్ అయిన ‘రాజావిన్ పారవైయిలే’ సినిమాలో కలిసి నటించారు.
