Site icon NTV Telugu

LEO: కశ్మీర్ అయిపొయింది… ఇక చెన్నైలో కలుద్దాం

Leo

Leo

కోలీవుడ్ లోనే కాదు ఓవరాల్ ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ సినిమా ఏదైనా ఉందా అంటే ‘దళపతి 67’. దళపతి విజయ్, డైరెక్టర్ లోకేష్ కనగారాజ్ కాంబినేషన్ లో ‘మాస్టర్’ సినిమా వచ్చింది. ఆశించిన స్థాయిలో మాస్టర్ మూవీ ఆడకపోవడంతో, లోకేష్ డైరెక్షన్ పై కామెంట్స్ వచ్చాయి. ఈ విమర్శలకి ‘విక్రమ్’ సినిమాతో ఎండ్ కార్డ్ వేసిన లోకేష్ కనగరాజ్, తన నెక్స్ట్ సినిమాని మళ్లీ విజయ్ తోనే చేస్తున్నాడు. ‘మాస్టర్’ మూవీతో బాకీ పడిన హిట్ ని ఈసారి #Thalapathy67 సినిమాతో సాలిడ్ గా అందుకోవాలని చూస్తున్నాడు లోకేష్ కనగరాజ్. వర్కింగ్ టైటిల్ తోనే సెట్స్ పైకి వెళ్లిన ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి ‘లియో’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసి ఇటివలే అఫీషియల్ గా అన్నౌన్స్ చేశారు. ఒక గ్లిమ్ప్స్ వీడియోని రిలీజ్ చేస్తూ మేకర్స్ టైటిల్ ని రివీల్ చేశారు. కాశ్మీర్ లో హ్యుజ్ స్టార్ కాస్ట్ మధ్య లోకేష్ కనగరాజ్ ఎలాంటి హడావుడి చెయ్యకుండా సైలెంట్ గా ‘లియో’ షూటింగ్ ని చేసేస్తున్నాడు.

కోలీవుడ్ హిస్టరీలోనే అంత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా పేరు తెచ్చుకున్న ఈ మూవీ షూటింగ్ లో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ రీసెంట్ గా జాయిన్ అయ్యాడు. దాదాపు ఏడు రోజుల పాటు సంజయ్ దత్ కి సంబంధించిన ఎపిసోడ్స్ ని షూట్ చేసిన లోకేష్ కనగరాజ్, సంజయ్ దత్ పార్ట్ ని కంప్లీట్ చేసాడట. కాశ్మీర్ షెడ్యూల్ లో సంజయ్ దత్ పార్ట్ కంప్లీట్ అయ్యింది, నెక్స్ట్ చెన్నై షెడ్యూల్ లో కలుద్దాం అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. కేవలం 90 రోజుల్లోనే లియో సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యేలా వర్క్ చేస్తున్న చిత్ర యూనిట్, మ్యాసివ్ స్పీడ్ లో పని చేస్తున్నట్లు ఉన్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసి ఈ దీపావళికి ‘లియో’ సినిమాని రిలీజ్ చెయ్యాలి అంటే దర్శక నిర్మాతల ఆలోచన. మరి ఇయర్ స్టార్టింగ్ లో వారసుడు సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దళపతి విజయ్, ఇయర్ ఎండ్ క్ లియో మూవీతో పాన్ ఇండియా హిట్ కోడతాడేమో చూడాలి.

Exit mobile version