NTV Telugu Site icon

Thalapathy Vijay: ‘లియో’ దెబ్బకు ‘పుష్ప 2’ రికార్డు బద్దలు!

Thalapathy Vijay

Thalapathy Vijay

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కలిసి మరోసారి పాన్ ఇండియా బాక్సాఫీస్‌ బద్దలు చేయడానికి రెడీ అవుతున్నారు. 2024 ఆగష్టు 15 న పుష్ప2 రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రస్తుతం షూటింగ్‌తో బిజీగా ఉన్నారు బన్నీ, సుక్కు. కానీ ఇప్పటికే మూడు నిమిషాల వీడియో, ఫస్ట్ లుక్ పోస్టర్‌తో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ముఖ్యంగా బన్నీ అమ్మవారు గెటప్ ఎవ్వరు ఊహించలేదు. ఈ ఒక్క పోస్టర్ సినిమా పై అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లిపోయింది. ఈ పోస్టర్ ఇన్‌స్టాగ్రామ్‌లో 7 మిలియన్ల లైకులు సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఏ సినిమా పోస్టర్‌ కూడా ఇన్ని లైక్‌లు రాలేదు. ప్రస్తుతానికైతే.. ఈ రికార్డ్ పుష్పరాజ్ పేరు మీదే ఉంది. కానీ తాజాగా విజయ్ లియో సినిమా పుష్ప2 ఫస్ట్ లుక్ విషయంలో ఓ రికార్డ్‌ బద్దలు కొట్టింది.

దళపతి విజయ్, లోకేష్ గకనరాజ్ కాంబినేషన్లో మాస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో.. లియో పై భారీ అంచనాలున్నాయి. దసరా సందర్భంగా అక్టోబర్ 21న లియో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో లియో అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. తాజాగా లియో నుంచి తెలుగు పోస్టర్‌ రిలీజ్ చేశారు. విజయ్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఈ పోస్టర్ కేవలం 32 నిమిషాల్లోనే మిలియన్ లైక్స్ సొంతం చేసుకుంది. దీంతో పుష్ప 2 రికార్డును లియో బ్రేక్ చేసినట్టైంది. పుష్ప 2 పోస్టర్ 33 నిమిషాల్లో మిలియన్ లైక్స్ మార్క్ అందుకుంది. కానీ ఇప్పుడు లియో ఒక నిమిషం ముందుగానే ఆ అరుదైన రికార్డు సాధించింది. ఈ లెక్కన లియో పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మరి లియో ఎలా ఉంటుందో చూడాలి.

Show comments