Sudigali Sudheer: గాలోడు సినిమాతో సుడిగాలి సుధీర్ మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తరువాత సుధీర్ వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇక గత ఏడాది గోట్ అనే సినిమాతో వస్తున్నట్లు సుగిగాలి సుధీర్ అధికారికంగా తెలిపాడు. పాగల్ వంటి రొమాంటిక్ ఎంటర్టైనర్ ని తెరకెక్కించిన నరేష్ కుప్పిలి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో సుధీర్ సరసన దివ్యభారతి నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది రిలీజ్ కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే గోట్ టైటిల్ తో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రంగంలోకి దిగాడు. దళపతి విజయ్ రీసెంట్ గా లియో సినిమాతో ఒక బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు.
ఇక ఈ సినిమా తరువాత డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో దళపతి 68ను అనౌన్స్ చేశారు. మీనాక్షి చౌదరి ,స్నేహ, యోగిబాబు, ప్రశాంత్ తదితరు నటీనటులు నటిస్తున్న ఈ చిత్రాన్ని అర్చన కలపతి నిర్మిస్తుంది. న్యూయర్ సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. The greatest of all time అనే ఇంగ్లీష్ టైటిల్ ను అనౌన్స్ చేస్తూ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అయితే అదే పేరు సుధీర్ సినిమాకు కూడా ఉంది. ఇప్పుడు ఈ టైటిల్ తో సుధీర్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఇక ఈ టైటిల్ అనౌన్స్ తో సుధీర్ ఫ్యాన్స్ అసెంబుల్ అయ్యారు. సుధీర్ టైటిల్ ను విజయ్ కొట్టేశాడని.. మా వరకు మాకు సుధీరే గోట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. విజయ్ ను, సుధీర్ ను సరి సమానంగా పోల్చడం కరెక్ట్ కాదు కానీ, అక్కడ విజయ్ కు.. ఇక్కడ సుధీర్ అంతే చెప్పొచ్చు అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాలు ఎలాంటి విజయాలను అందుకుంటాయో చూడాలి.
