కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో ‘లియో’ సినిమా చేస్తున్నాడు. గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జూన్ 15 నాటికి లియో షూటింగ్ పార్ట్ కంప్లీట్ చెయ్యాలని లోకేష్ ప్లాన్ చేసాడట. అక్టోబర్ లోనే రిలీజ్ ఉండడంతో లియో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. లియో తర్వాత విజయ్ ఎవరితో సినిమా చేస్తాడు అనే విషయంలో పెద్ద లిస్ట్ వినిపిస్తోంది. అట్లీ, మురుగదాస్, గోపీచంద్ మలినేని లాంటి దర్శకులతో విజయ్ సినిమా చెయ్యబోతున్నాడు అనే వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే లేటెస్ట్ గా ఇవేమీ కాదు విజయ్ నెక్స్ట్ సినిమా వెంకట్ ప్రభుతో చేస్తున్నాడు అంటూ కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. క్రియేటివ్ గా కథ చెప్పడం, కథనంలో కావాల్సినన్ని ట్విస్ట్ లు పెట్టడం వెంకట్ ప్రభు స్టైల్ అఫ్ ఫిల్మ్ మేకింగ్. అజిత్ తో మంగాత్తా సినిమా చేసిన తర్వాత వెంకట్ ప్రభు ఫేట్ పూర్తిగా మారిపోయింది. అజిత్ కెరీర్ డౌన్ ఫాల్ అవుతున్న సమయంలో, అతన్ని సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో చూపించి వెంకట్ ప్రభు మంగాత్తా సినిమాతో సూపర్ హిట్ ఇచ్చాడు. అప్పటి నుంచి వెంకట్ ప్రభుకి తమిళ ఆడియన్స్ లో క్రేజ్ పెరిగింది.
రీసెంట్ గా కూడా ఆల్మోస్ట్ కెరీర్ అయిపొయింది అనుకున్న హీరో శింబుకి ‘మానాడు’ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ హిట్ ఇచ్చాడు వెంకట్ ప్రభు. ఇలా తమిళ హీరోలకి మంచి సినిమాలు ఇచ్చే వెంకట్ ప్రభు, రీసెంట్ గా తెలుగు ప్రేక్షకులకి మాత్రం ఒక ఫ్లాప్ సినిమా ఇచ్చాడు. అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కస్టడీ’కి వెంకట్ ప్రభు డైరెక్టర్. బైలింగ్వల్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర నష్టాల్లో ఉంది. దాదాపు 20 కోట్లు నష్టాన్ని మిగిలించిన దర్శకుడితో విజయ్ లాంటి స్టార్ హీరో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు అంటే చిన్న విషయం కాదు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాట ప్రకారం విజయ్ కి ఈ మూవీ కోసం ఆల్మోస్ట్ 200 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారట. ఒకవేళ ఇది నిజమైనా సినిమా బడ్జట్ 300 కోట్ల వరకూ ఉంటే అంత భారీ బడ్జట్ సినిమాని కూడా వెంకట్ ప్రభు హ్యాండిల్ చేయగలడా లేదా అనేది ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే వెంకట్ ప్రభు భారీ బడ్జట్ సినిమాలని చెయ్యడు, కథలో ట్విస్ట్ లతో గేమ్ ప్లే చేస్తాడు. మరి ఏ విషయంలో డేర్ చేసి ఈ ప్రాజెక్ట్ ని ఆన్ చేస్తున్నారో చూడాలి.
