NTV Telugu Site icon

Thalapathy 67: విజయ్-త్రిష కాంబినేషన్ కోసం 14 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నారా?

Thalapathy 67

Thalapathy 67

లోకేష్ కనగరాజ్, దళపతి విజయ్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన లేటెస్ట్ మూవీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మాస్టర్ సినిమా తర్వాత రిపీట్ అవుతున్న ఈ కాంబినేషన్ లోని సినిమాకి #Thalapathy67 అనే వర్కింగ్ టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ రెగ్యులర్ షూటింగ్ కోసం చిత్ర యూనిట్ కాశ్మీర్ వెళ్లారు. దళపతి 67 గురించి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ బయటకి రావడంతో సోషల్ మీడియాలో టెంపరేచర్ పెరిగింది. టాగ్స్ క్రియేట్ చేసి విజయ్ ఫాన్స్ ట్విట్టర్ ని షేక్ చేస్తున్నారు. #Thalapathy67 ట్యాగ్ తో పాటు #Trisha ట్యాగ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకు కారణం దళపతి 67 సినిమాలో హీరోయిన్ గా త్రిషా నటించడమే. కెరీర్ అయిపొయింది అనుకుంటున్న టైంలో భారి బడ్జట్ సినిమాల్లో నటిస్తూ త్రిషా అందరికీ షాక్ ఇస్తుంది. త్రిషని విజయ్ పక్కన హీరోయిన్ గా చూడడానికి 14 ఏళ్లుగా కోలీవుడ్ సినీ అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ దళపతి 67 సినిమా అనౌన్స్ అయ్యింది. అసలు విజయ్-త్రిషాల కాంబినేషన్ కోసం ఫాన్స్ అంతగా వెయిట్ చెయ్యడానికి కారణం ఏంటా అని చూస్తే… ఈ ఇద్దరి కాంబినేషన్ లో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.

ఒకటి కాదు రెండు కాదు నాలుగు సినిమాల్లో విజయ్-త్రిష కలిసి నటించారు. నాలుగులో మూడు సూపర్ హిట్స్ ఇచ్చిన విజయ్-త్రిషలు హిట్ పెయిర్ గా నిలిచిపోయారు. ఒక్కడు రీమేక్ ‘గిల్లీ’, అతనొక్కడే రీమేక్ ‘ఆది’, ‘తిరుపాచ్చి’ సినిమాలు విజయ్ కెరీర్ లో చాలా స్పెషల్. ముఖ్యంగా గిల్లీ సినిమా విజయ్ ని ఈ జనరేషన్ స్టార్ లీగ్ లోకి తెచ్చింది. ఈ మూవీలో విజయ్-త్రిష కెమిస్ట్రీ, కామెడీ, డాన్స్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. చివరగా 2008లో ఈ హీరో-హీరోయిన్ కాంబినేషన్ లో ‘కురువి’ అనే సినిమా వచ్చింది. ఈ మూవీ యావరేజ్ గా నిలిచింది. అప్పటినుంచి విజయ్-త్రిష కలిసి సినిమా చెయ్యలేదు. మళ్లీ 14 ఏళ్ల తర్వాత ఇప్పుడు దళపతి 67 సినిమాలో నటిస్తున్నారు. అందుకే సోషల్ మీడియాలో #Trisha ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. మరి ఆ వింటేజ్ వైబ్స్ ని విజయ్-త్రిష దళపతి 67 సినిమాతో మరోసారి ఇస్తారేమో చూడాలి.

Show comments