Site icon NTV Telugu

Thalaivar 171: టైటిల్ చెప్పేశారు.. ఫాన్స్ గెట్ రెడీ!

Coolie

Coolie

Thalaivar 171 Title is Revealed as Coolie: తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ గత ఏడాది విడుదల అయిన జైలర్ సినిమాతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు. జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో తలైవా ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అయితే మధ్యలో వచ్చిన లాల్ సలాం ఇబ్బంది పెట్టినా ఆయనది అతిథి పాత్ర కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ పడలేదు. ఇక ఇప్పటికే రజినీ ‘వెట్టయ్యాన్’ సినిమా చేస్తుండగా..ఈ చిత్రానికి జై భీమ్‌ ఫేం టీజే జ్ఞానవేళ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. చాలావరకు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ చిత్రం అనంతరం రజినీకాంత్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ తో ‘తలైవా 171’ మూవీ చేయనున్నాడు. ఖైదీ, విక్రమ్‌, లియో లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను ఇండస్ట్రీకి అందించిన లోకేశ్‌ కనగరాజ్,రజినీకాంత్‌ కాంబోలో సినిమా రాబోతుండడంతో ఎలా ఉండబోతుందోనని అంతా ఎంతో ఎక్జయిటింగ్‌గా ఎదురు చూస్తున్నారు.

Aa Okkati Adakku :‘పెళ్లి ఎప్పుడు?’, అని అడిగే వాళ్ళని కొత్త చట్టం పెట్టి లోపలేయించండి!

ఇదిలావుంటే ఈ మూవీ టైటిల్ ను తాజాగా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అనౌన్స్ చేసింది. కూలీ పేరుతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇక ఆ టీజర్ ను బట్టి చూస్తే ఒక గోల్డ్ స్మగ్లింగ్ గ్యాంగ్ ను చితక్కొట్టిన కూలీగా కనిపిస్తున్నారు. తన ఫేమస్ డైలాగ్ ఒకటి కూడా రజనితో చెప్పించారు. ఈ సినిమాను లీడింగ్‌ ప్రొడక్షన్‌ హౌజ్‌ సన్ పిక్చర్స్ తెరకెక్కిస్తోండగా.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నాడు. లాల్ సలాం దెబ్బతో రజనీ అప్ కమింగ్ మూవీస్ పైనే ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. టీజర్ చూస్తుంటే వాళ్ళ ఆకలి తీరిపోయేలానే కనిపిస్తోంది. చూడాలి మరి.

Exit mobile version