Thalaivar 171: టైటిల్ చెప్పేశారు.. ఫాన్స్ గెట్ రెడీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thalaivar 171 Title is Revealed as Coolie: తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ గత ఏడాది విడుదల అయిన జైలర్ సినిమాతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు. జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో తలైవా ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అయితే మధ్యలో వచ్చిన లాల్ సలాం ఇబ్బంది పెట్టినా ఆయనది అతిథి పాత్ర కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ పడలేదు. ఇక ఇప్పటికే రజినీ ‘వెట్టయ్యాన్’ సినిమా చేస్తుండగా..ఈ చిత్రానికి జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహిస్తున్నాడు. చాలావరకు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ చిత్రం అనంతరం రజినీకాంత్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో ‘తలైవా 171’ మూవీ చేయనున్నాడు. ఖైదీ, విక్రమ్, లియో లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను ఇండస్ట్రీకి అందించిన లోకేశ్ కనగరాజ్,రజినీకాంత్ కాంబోలో సినిమా రాబోతుండడంతో ఎలా ఉండబోతుందోనని అంతా ఎంతో ఎక్జయిటింగ్‌గా ఎదురు చూస్తున్నారు.
Aa Okkati Adakku :‘పెళ్లి ఎప్పుడు?’, అని అడిగే వాళ్ళని కొత్త చట్టం పెట్టి లోపలేయించండి!
Also Read
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
- Raja Karuppasamy: 'అంటే సుందరానికీ' అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
ఇదిలావుంటే ఈ మూవీ టైటిల్ ను తాజాగా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అనౌన్స్ చేసింది. కూలీ పేరుతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇక ఆ టీజర్ ను బట్టి చూస్తే ఒక గోల్డ్ స్మగ్లింగ్ గ్యాంగ్ ను చితక్కొట్టిన కూలీగా కనిపిస్తున్నారు. తన ఫేమస్ డైలాగ్ ఒకటి కూడా రజనితో చెప్పించారు. ఈ సినిమాను లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ సన్ పిక్చర్స్ తెరకెక్కిస్తోండగా.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. లాల్ సలాం దెబ్బతో రజనీ అప్ కమింగ్ మూవీస్ పైనే ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. టీజర్ చూస్తుంటే వాళ్ళ ఆకలి తీరిపోయేలానే కనిపిస్తోంది. చూడాలి మరి.
తాజావార్తలు
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
-
Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్‌ప్లే, Dolby Vision, 65W సౌండ్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!