NTV Telugu Site icon

Thalaivar 170: వేటగాడు గా వస్తున్న రజినీ.. ఈ ఏజ్ లో కూడా ఆ స్టైల్ ఏంటి తలైవా

Rajini

Rajini

Thalaivar 170: సూపర్ స్టార్ రజినీకాంత్ వయస్సుతో సంబంధం లేకుండా కుర్ర హీరోలా దూసుకుపోతున్నాడు. జైలర్ హిట్ తో రజినీ జోష్ పెంచాడు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు, నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి తలైవర్ 170. జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నీ తాకుతున్నాయి ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, కిషోర్, రితికా సింగ్, దుషార విజయన్, GM సుందర్, రోహిణి, రావు రమేష్, రమేష్ తిలక్, రక్షణ లాంటి స్టార్లను దింపి మరింత హైప్ ను క్రియేట్ చేసారు. ఇక నేడు తలైవర్ పుట్టినరోజు కావడంతో ఈ సినిమా టైటిల్ టీజర్ ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ సినిమాకు వెట్టాయన్ అనే పేరును ఖరారు చేశారు. అంటే తెలుగులో వేటగాడు అని అర్ధం.

ఇక టైటిల్ టీజర్ లో రజినీ స్టైల్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. టీజర్ లో రజినీ తనదైన స్టైల్లో నడుచుకుంటూ వస్తూ.. వేట మొదలైనప్పుడు వేటాడడం తప్పదు’ అంటూ రజనీకాంత్ చెప్పే డైలాగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక దీనికి అనిరుధ్ మ్యూజిక్ తోడవ్వడంతో టీజర్ మొత్తం పవర్ ఫుల్ గా కనిపించింది. అసలు ఈ వయస్సులో కూడా రజినీ స్టైల్ చూసి అభిమానులు మంత్రముగ్దులు అవుతున్నారు. ఇందులో కూడా రజినీ పోలీస్ గానే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా రజినీకి ఎలాంటి హిట్ ను అందిస్తుందో చూడాలి.