NTV Telugu Site icon

Ajith: చెన్నైలో అడుగుపెట్టిన తల… ఆగిపోయిన సినిమా

Ajith

Ajith

2023 సంక్రాంతికి ‘తునీవు’ సినిమాతో కెరీర్ బిగ్గెట్ హిట్ కొట్టాడు తల అజిత్. కోలీవుడ్ లో మోస్ట్ ప్రాఫిటబుల్ సినిమాల్లో ఒకటిగా నిలిచిన తునీవు సినిమాతో అజిత్ ఓవర్సీస్ లో సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టాడు. ఈ మూవీ రిలీజ్ అయిన కొన్ని రోజులకే అజిత్ తన నెక్స్ట్ సినిమాని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో చేస్తున్నాడు అనే వార్త బయటకి వచ్చింది. ఈ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్న సమయంలో విగ్నేష్ శివన్ ప్లేస్ లోకి మగిళ్ తిరుమేణి వచ్చి చేరాడు. ‘AK 62’ అనేవర్కింగ్ టైటిల్ ని తీసేసి, మే 1న తల అజిత్ పుట్టిన రోజు సందర్భంగా ‘విడ ముయార్చి’గా ప్రాజెక్ట్ అఫీషియల్ గా అనౌన్స్ అయ్యింది.

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై, మగిళ్ తిరుమేణి డైరెక్షన్ లో ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని తల ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మూడు నెలలుగా ఈ వెయిటింగ్ కొనసాగుతూనే ఉంది కానీ విడ ముయార్చి ప్రాజెక్ట్ పై అప్డేట్ మాత్రం బయటకి రావట్లేదు. లేటెస్ట్ గా విడ ముయార్చి ప్రాజెక్ట్ ఆగిపోయిందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఇందులో ఎంతవరకూ నిజముంది అనే విషయం తెలియాల్సి ఉంది. కోలీవుడ్ మీడియా నుంచి వస్తున్న సమాచారం ప్రకారం విడ ముయార్చి ప్రాజెక్ట్ అలానే ఉంటుంది కానీ లైకా ప్రొడక్షన్ లో అజిత్ నటించకపోవచ్చు అంటున్నారు. ఒకవేళ లైకా కాకపోతే ఈ ప్రాజెక్ట్ ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు అనేది చూడాలి. అసలు హీరో లేకుండా ఈ డిస్కషన్స్ ఎందుకు అనుకుంటున్న సమయంలో అజిత్ చెన్నై రిటర్న్ వచ్చాడు. గత రాత్రి చెన్నై వచ్చిన అజిత్ కి ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. మరి అజిత్ తిరిగొచ్చాడు కాబట్టి రాబోయే రోజుల్లో అయినా విడ ముయార్చి ప్రాజెక్ట్ విషయంలో ఒక క్లారిటీ వస్తుందేమో చూడాలి.

Show comments