NTV Telugu Site icon

TG Vishwaprasad: మా ప్రైవసీకి గౌరవం ఇవ్వండి.. జర్నలిస్టులకి పీపుల్ మీడియా నిర్మాత కౌంటర్!

Tg Vishwa Prasad

Tg Vishwa Prasad

TG Vishwa Prasad Counter to Film Journalist: తెలుగు సినీ వార్తలు కవర్ చేసే ఒక సీనియర్ జర్నలిస్ట్ మిస్టర్ బచ్చన్ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ గురించి చేసిన ట్వీట్ పెద్ద చర్చకి దారి తీసింది.. ఈ విషయం మీద ముందుగా మిస్టర్ బచ్చన్ సినిమా దర్శకుడు హరీష్ శంకర్ స్పందించాడు. దయచేసి ఇప్పుడున్న వాతావరణాన్ని చెడగొట్టవద్దు అంటూ ముందు హరీష్ శంకర్ ట్విట్ చేశారు. ఆ తర్వాత అది పెద్ద చర్చకే దారితీసింది. మీకు ఇంటర్వ్యూ ఇద్దామనుకుంటున్నానని హరీష్ శంకర్ అంటే నేనేమీ ఇంటర్వ్యూ కోసం పాకులాడం లేదని సదరు సీనియర్ జర్నలిస్ట్ అనడం ఇలా పెద్ద చర్చ జరుగుతున్న సమయంలోనే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఎంట్రీ ఇచ్చారు.

Renu Desai: పవన్ కళ్యాణ్ మాజీ భార్యను ఘనంగా సత్కరించిన తెలంగాణ మంత్రి.. కారణమేంటంటే.?

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బిజినెస్ విషయాలు చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచే విషయంలో వర్టికల్ గా ఉంటుందని అన్నారు కొంతమంది ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు అత్యుత్సాహంతో మా ప్రైవేట్ కాన్ఫిడెన్షియల్ విషయాలను బట్టబయలు చేయకూడదని కోరుతున్నట్లుగా ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే ఇది కచ్చితంగా సదరు సీనియర్ జర్నలిస్ట్ గురించి చేసిన ట్వీట్ అనే చర్చ అయితే జరుగుతోంది. నిజానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో లీడింగ్ ప్రొడక్షన్ సంస్థగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వీలైనంత త్వరగా 100 సినిమాలను నిర్మించాలని టార్గెట్ పెట్టుకుని సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టిన డిజిపి శివ ప్రసాద్ ఇప్పటికే దాదాపు పాతిక సినిమాలను దగ్గరగా పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇక ఈ ట్వీట్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి