TFJA Complaints DGP Over Rashmika Deep Fake Video: డీప్ ఫేక్ టెక్నాలజీ సాయంతో సిద్ధం చేసిన రష్మిక మందన్నా మార్ఫింగ్ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ అంశం మీద కేవలం సినీ రంగానికి చెందిన వారే కాదు సామాన్య ప్రజానీకం సైతం మండిపడుతున్నారు. ఇక ఈ అంశం మీద దేశవ్యాప్తంగా నిరసనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది ఆకతాయిలు, జారా పటేల్ అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోకి రష్మిక మందన్న ముఖాన్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది కాస్తా వైరల్‌గా మారడంతో ఈ ఘటనపై పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఇప్పటికే స్పందించారు. ఇలా మార్ఫింగ్ చేయడాన్ని తీవ్రంగా ఖండింస్తుండగా రష్మిక మందన్నా మార్ఫింగ్ వీడియో వ్యవహారాన్ని తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సైతం తమ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా ఖండించింది.
Vijay Devarakonda : రష్మిక డీప్ ఫేక్ వీడియో పై స్పందించిన విజయ్ దేవరకొండ..
ఇక తాజాగా అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మి నారాయణ, జనరల్ సెక్రటరీ వై.జే రాంబాబు సంబంధిత విషయంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డిజిపి అంజనీకుమార్ ను కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధ్యతగా వ్యవహరించిన అసోసియేషన్ ని అభినందించిన అంజనీ కుమార్ వెంటనే ఈ కేసు ను సైబర్ క్రైమ్ టీమ్ కి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి చర్యలు జరిగిన వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని అంజనీ కుమార్ సూచించారు.