Site icon NTV Telugu

అది మా ఉద్దేశం కాదు.. ఎన్టీవీతో యూట్యూబ్ ఛానెల్

samantha

telugu youtube channel clarification on samantha defamation case

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా నాగ చైతన్యతో విడాకుల విషయంలో అనేక వార్తలు హల్ చల్ చేశాయి. సామ్, నాగ చైతన్య విడాకుల విషయం ప్రకటించినప్పుడే తమ ప్రైవసీకి భంగం కలిగించొద్దు అంటూ మీడియాను, సోషల్ మీడియాను, అభిమానులను ఆమె వేడుకున్నారు. అయితే ఆమె గురించి సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం బాగా జరిగింది. తన స్టైలిస్ట్ తో ఎఫైరే చైతో విడాకులకు కారణమని, పిల్లల వద్దనుకుందని వివిధ రకాలుగా వార్తలు వచ్చాయి. వాటన్నింటిపైనా స్పందించిన సామ్ ఇన్స్టా పోస్ట్ ద్వారా ఆవేదనను వ్యక్తం చేశారు. ఇలాంటి వార్తలపై ఆమె ఫైర్ అయింది.

తన పరువుకు భంగం కలిగించారంటూ మూడు యూట్యూబ్ చానల్స్ పై సమంత పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. కూకట్ పల్లి కోర్టులో దీనిపై విచారణ జరుగుతోంది.  అందులో ఒక యూట్యూబ్ ఛానెల్ ఎండీ ntvtelugu.com తో మాట్లాడారు. ”ఆమెని అసభ్యంగా చూపించడం మా ఉద్దేశం కాదు”. అలాగే ఏ సెలబ్రిటీ వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయడం, వారి ప్రతిష్టకు భంగం కలిగించడం మా ఉద్దేశం కాదు” అని వివరించారు . మరి కోర్టు ఈ విషయంపై ఎలాంటి తీర్పును ఇస్తుందో చూడాలి.

Exit mobile version