Dark Secrets OTT: కంటెంట్ ఉన్న కొత్త కాన్సెప్ట్ ఉంటే చిన్న సినిమా కూడా ఓటీటీలో సంచలనం సృష్టించగలదని మరోసారి నిరూపించింది తెలుగు సైకలాజికల్ రొమాంటిక్ థ్రిల్లర్ ‘డార్క్ సీక్రెట్స్’. ఈ బోల్డ్ ఆంథాలజీ మూవీ దేశవ్యాప్తంగా ట్రెండింగ్ టాప్ 10లో ఏకంగా నంబర్ వన్ స్థానానికి చేరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే ?
ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ‘డార్క్ సీక్రెట్స్’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో పే పర్ వ్యూ విధానంలో ఇది అందుబాటులో ఉంది. ఇది థియేటర్లలో రిలీజ్ కాకుండా నేరుగా ఓటీటీలోకి అడుగు పెట్టింది. సాధారణంగా అద్దెకు అందుబాటులో ఉండే సినిమాలు ఇలాంటి స్థాయిలో ప్రేక్షకాదరణ పొందడం అరుదుగా కనిపిస్తుంది. కానీ ‘డార్క్ సీక్రెట్స్’ విషయంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. భారీ బడ్జెట్ చిత్రాలు పోటీలో ఉన్నప్పటికీ, ఒక చిన్న తెలుగు సినిమా ట్రెండింగ్‌లో అగ్రస్థానానికి చేరుకోవడం ఇండిపెండెంట్ కంటెంట్‌కు పెరుగుతున్న ఆదరణను స్పష్టంగా కనిపిస్తోంది.
అప్సర రాణి ప్రధాన పాత్రలో నటించిన ఈ బోల్డ్ సైకలాజికల్ రొమాంటిక్ థ్రిల్లర్ 2026 ఆగస్టు 5న నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలైంది. అవినాష్ కొకటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఆంథాలజీ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో ₹99/- రెంటల్ (అద్దె) విధానంలో అందుబాటులో ఉంటూ టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ప్రైమ్ వీడియోతో పాటు హంగామా (Hungama), వాచో (Watcho), ఎక్స్‌స్ట్రీమ్ ప్లే (Xstream Play) వంటి పలు ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమాలో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉన్నందున దీనికి 18+ (అడల్ట్) రేటింగ్ ఇవ్వబడింది.
స్టోరీ
ఇది మనసులోని రహస్యాలు, కోరికల చుట్టూ తిరిగే ఒక బోల్డ్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమాలో నాలుగు వేర్వేరు కథలను (ఆంథాలజీ) చూపించారు. కథ విషయానికొస్తే: ప్రతి మనిషి జీవితంలోనూ బయటికి చెప్పలేని ఒక సీక్రెట్ కచ్చితంగా ఉంటుంది. ఒకవేళ ఆ నిజం బయటపడితే వాళ్ల జీవితాలు ఎలా మారిపోతాయి? అనే పాయింట్ మీద ఈ సినిమా నడుస్తుంది. నలుగురు వేర్వేరు అమ్మాయిల జీవితాల్లోని కోరికలు, వాళ్లు దాచిన రహస్యాలు, సొసైటీ వల్ల వాళ్లు పడే మానసిక ఇబ్బందులు, వాళ్ల రిలేషన్‌షిప్స్‌లో వచ్చే ఊహించని ట్విస్టులను ఈ సినిమాలో చాలా బోల్డ్‌గా చూపించారు.
ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనకు నిదర్శనంగా ‘డార్క్ సీక్రెట్స్’కు ఐఎమ్‌డీబీలో 7.7 రేటింగ్ లభించింది. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా గురించి విస్తృత చర్చ కొనసాగుతుండటంతో వ్యూయర్‌షిప్ రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటల్ విభాగంలో అందుబాటులో ఉన్న డార్క్ సీక్రెట్స్, థ్రిల్లర్‌లు, సైకలాజికల్ డ్రామాలు ఇష్టపడే ప్రేక్షకులకు విభిన్నమైన ఓటీటీ థ్రిల్ ను అందిస్తోంది. ఓటీటీ వేదికపై ఈ చిన్న తెలుగు సినిమా సాధిస్తున్న ట్రెండింగ్ ఫీట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

