Site icon NTV Telugu

Breaking: సినీ పరిశ్రమలో విషాదం.. గుండెపోటుతో స్టార్ డైరెక్టర్ మృతి

Siddique

Siddique

Director Siddique Dies Due to Cardiac Arrest : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ దర్శకుడు సిద్దిఖీ గుండెపోటుతో మరణించారని తెలుస్తోంది. నిన్న గుండెపోటుకు గురైన ఆయనను కొచ్చిలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆయన పరిస్థితి విషమించడంతో ఎక్మో సపోర్ట్ అందిస్తున్నట్టు వెల్లడించారు. ఇక నిన్నటి నుంచి నుంచి చావుతో పోరాడిన ఆయన కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. వారం క్రితం 69 ఏళ్లు నిండిన సిద్ధిక్, ఆదివారం అంటే 6 ఆగస్టు 2023న కొచ్చిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో గుండెపోటు కారణంగా చేరారు. అంతకు ముందే న్యుమోనియా సహా ఇతర శ్వాసకోశ సమస్యల చికిత్స కోసం సిద్దిక్ జూలై 10, 2023న కూడా ఆసుపత్రిలో చేరారు.

Keerthy Suresh: ఆ చెల్లి వల్లే నాకు కీర్తి చెల్లి దొరికింది: మెహర్ రమేష్

కోలుకున్నారు అనుకునేలోపే గుండెపోటు కూడా రావడంతో ఆయన కన్నుమూశారు. సిద్ధిక్‌కు భార్య సజిత, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఫ్రెండ్స్ (2001), ఎంగల్ అన్నా (2004), సాధు మిరాండా (2008), కావలన్ (2011), భాస్కర్ ఒరు రాస్కల్ (2018) వంటి చిత్రాలను అందించి తమిళ చిత్ర పరిశ్రమలో కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. గాడ్ ఫాదర్, హిట్లర్, బిగ్ బ్రదర్, ఫ్రెండ్స్, కాబూలీవాలా వంటి సినిమాలు తెరకెక్కించిన ఆయన సల్మాన్ ఖాన్ హిందీలో బాడీగార్డ్ సినిమా చేశారు. మోహన్ లాల్ తో తీసిన ‘బిగ్ బ్రదర్’ మూవీ తెలుగులో డబ్ అయింది, అదే విధంగా నితిన్ హీరోగా తెలుగులో మారో సినిమాను కూడా ఆయన డైరెక్ట్ చేశారు.

Exit mobile version