Telugu Hero Playing Key Role In Dhanush Captain Miller: మల్టీస్టారర్, పాన్ ఇండియా సినిమాలతో పాటు ఓటీటీ పుణ్యమా అని.. సినీ పరిశ్రమల మధ్య బార్డర్లు చెరిగిపోయిన సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలోనే తమ సినిమాల్లో పరభాష హీరోల్ని తీసుకుంటున్నారు ఫిల్మ్ మేకర్స్. ఇలా తీసుకోవడం వల్ల ఆ ఇండస్ట్రీలోనూ మార్కెట్ కలిసొస్తుందన్నదే ముఖ్య ఉద్దేశం. ఇదే స్ట్రాటజీని తన తదుపరి సినిమాకు ధనుష్ సినిమా మేకర్స్ అనుసరిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ధనుష్ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే.. వాటిల్లో కెప్టెన్ మిల్లర్‌కి ఇండస్ట్రీలో అప్పుడు విపరీతమైన బజ్ ఏర్పడింది. 1990-40ల బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో ఈ పీరియడ్ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాని తెలుగులోనూ గ్రాండ్ స్కేల్‌లో విడుదల చేయాలన్న ఉద్దేశంతో.. ఓ తెలుగు హీరోని తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఫైనల్‌గా సందీప్ కిషన్‌ని ఎంపిక చేసినట్టు తెలిసింది. అతడు ఇందులో ఓ కీలక పాత్ర పోషించనున్నాడట! ఇతని కంటే ముందు ఇద్దరు, ముగ్గురు యువ హీరోల్ని పరిశీలించారు. అందునా, తమిళ ప్రేక్షకులకు సుపరిచితులైన నటుల్ని సంప్రదించారట! చివరికి సందీప్ కిషన్ ఓకే చెప్పడంతో, అతడ్ని ఫైనల్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. అతడొక మంచి నటుడు కావడం, తమిళంలోనూ పలు సినిమాల్లో నటించడంతో.. సందీప్‌ని ఎంపిక చేశారట! ఇప్పుడున్న పరిస్థితుల్లో సందీప్ కిషన్‌కి ఇది మంచి ఆఫరేనని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అతని కెరీర్ ఒడిదుడుకులతో సాగుతోంది. ఒకవేళ ఈ పాత్ర కనుక క్లిక్ అయితే, సందీప్ కెరీర్ ఊపందుకోవడం ఖాయం.
కాగా.. అరుణ్ మతేశ్వరన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ పీరియడ్ సినిమానను సత్య జ్యోతి ఫిల్మ్స్ అనే నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ బహుభాషా చిత్రానికి జీవీ ప్రకాశ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇందులో ధనుష్ సరసన ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయికగా నటించనుందని సమాచారం.
