NTV Telugu Site icon

బిగ్ బాస్ సీజన్ 5 పోటీదారులు వీరేనా!?

Bigg-Boss5

Bigg-Boss5

తెలుగునాట ప్రాచుర్యం పొందిన రియాల్టీ గేమ్ షో ‘బిగ్ బాస్’ 5వ సీజన్ సెప్టెంబర్‌లో మొదలు కాబోతోంది. వరుసగా మూడోసారి కింగ్ నాగార్జున ఈ షోని హోస్ట్ చేయబోతున్నారు. కరోనా మూడో వేవ్ రాబోతుందన్న వార్తల నేపథ్యంలో నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ సీజన్ ను ఆరంభించానికి సన్నాహాలు చేస్తున్నారు. గత సీజన్ లో పోటీదారులందరూ హైదరాబాద్‌లో స్టార్ హోటల్‌లో క్వారంటైన్ టైమ్ స్పెండ్ చేసి నేరుగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా ఈ ఏడాది మాత్రం అందరూ తమ తమ ఇళ్ళలోనే జాగ్రత్తలు తీసుకుంటూ హోమ్ క్వారంటైన్ లో ఉన్నారట.
ఇక గత కొంత కాలంగా బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొనే పోటీదారుల గురించి పలు ఊహాగానాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.

Read Also : బండ్ల గణేష్ నిర్ణయం మార్చుకున్నాడు !

అయితే దానికి సంబంధించి కొంత మంది ఖండించగా మిగిలిన వారు కామ్ గా ఉండి పోయారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవల కాలంలో యూట్యూబ్ లో ఫేమస్ అయిన షణ్ముఖ్ జస్వంత్, యాంకర్స్ రవి, వర్షిణి సౌందరరాజన్, ఆర్జే కాజల్, నటి సరయు, హీరోయిన్ ఇషా చావ్లా, డాన్స్ మాస్టర్స్ రఘు, అని, నటరాజ్, విజె లోబో, టీవీ నటుడు, విజె సన్నీ, నటీనటులు శ్వేతవర్మ, మానస్, సిరి హనుమంతు, నవ్యస్వామి, ఆట సందీప్, బాలనటుడు దీపక్ పాల్గొనబోతున్నారట. మరి వెలుగులోకి వచ్చిన ఈ లిస్ట్ లోని వారే పార్టిసిపేట్ చేయనున్నారా? లేక ఇంకా కొత్త పేర్లు ఏమైనా వెలుగులోకి వస్తాయా? హౌస్ లో ఆట ఎప్పటి నుంచి మొదలు కానుంది. ఈ సీజన్ లో విజేతగా నిలిచేది ఎవరు? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం దొరకాలంటే కొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందే.