Site icon NTV Telugu

Telugu Film Producers Council : సమ్మె వార్తల నేపథ్యంలో నిర్మాత మండలి సమావేశం!

Producers Council

Producers Council

Telugu Film Producers Council -TFPC:

అతి త్వరలో తెలుగు చిత్ర నిర్మాతలు కొందరు స్వచ్ఛందంగా సినిమా షూటింగ్స్ ను ఆపివేయబోతున్నారనే వార్తలు కొన్ని రోజులుగా ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. అలానే ఫెడరేషన్ కు సంబంధించిన యూనియన్ల వేతనాలు పెంపుదలపై మరో పక్క చర్చలు జరుగుతున్నాయి. ఈ కమిటీకి ‘దిల్’ రాజును ఛైర్మన్ గా ఎంపిక చేశారు. ఇవేవీ ఓ కొలిక్కి రాక ముందే అగ్ర చిత్రాల నిర్మాతలు కొద్ది రోజుల పాటు షూటింగ్స్ ను ఆపివేస్తే బాగుంటుందనే ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులను సమీక్షించుకోవడానికి తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి రాబోయే గురువారం (21వ తేదీ) సాయంత్రం కౌన్సిల్ హాల్ లో సమావేశం కావాలని నిర్ణయించుకుంది. ఈ స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ కు సంబంధించిన సమాచారాన్ని సోమవారం తన సభ్యులకు తెలియచేసింది. ఓటీటీ, వీపీఎఫ్ ఛార్జీలు, టిక్కెట్ ధరలు, సినిమా బడ్జెట్, పని పరిస్థితులు, వేతనాలు, ఫైటర్స్ యూనియన్ సమస్యలు, ఫెడరేషన్ తో పెండింగ్ లో వ్యవహారాలు, మేనేజర్ల పాత్ర, నటీనటులు, సాంకేతిక నిపుణులతో ఇప్పటికే ఉన్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చించబోతున్నట్టు నిర్మాతల మండలి కార్యదర్శులు ప్రస్నన్న కుమార్, మోహన్ వడ్లపట్ల ఓ ప్రకటనలో తెలిపారు.

Exit mobile version