Fake Collections Issue: టాలీవుడ్ లో ఫేక్ కలెక్షన్స్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా గుంటూరు కారం సినిమా యూనిట్ కలెక్షన్స్ ఫేక్ చేసిందంటూ కొన్ని వెబ్ సైట్స్ కథనాలు వండి వడ్డించాయి. ఈ విషయం మీద నిర్మాత నాగ వంశీ సోషల్ మీడియా వేదికగానే చురకలు వేశారు. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి కీలక నిర్ణయం తీసుకున్నారు. నాగవంశీ ఫిర్యాదు మేరకు తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబిటర్ అసోసియేషన్ పలు వెబ్ సైట్స్ కు నోటీసులు జారీ చేసింది. ఏవైతే వెబ్ సైట్స్ సినిమాల కలెక్షన్స్ వివరాలు ప్రచురిస్తున్నాయో దానికి సంబంధించిన పారదర్శకత నిరూపించుకోవాలని నోటీసుల్లో పేర్కొంది. రిపోర్ట్ చేసే వారిలో కూడా అకౌంటబిలిటీ తీసుకురావాలని ఉద్దేశంతో ఈ మేరకు నోటీసులు జారీ చేశామని అసోసియేషన్ చెబుతోంది.
Mohan Babu: అయోధ్యకు రమ్మని ఆహ్వానం.. ఆ కారణంగా రాలేనని మోహన్ బాబు లేఖ
మీకు ఎవరు ఈ కలెక్షన్స్ వివరాలు చెబుతున్నారు? మీరు పబ్లిష్ చేస్తున్న డేటా ఎంత వరకు శాతం నిజమని మీరు చెప్పగలరు? మీరు పబ్లిష్ చేసిన నెంబర్ ల వల్ల ఏదైనా పొరపాటు జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? అని నోటీసుల్లో ప్రశ్నలు కూడా కురిపించినట్లుగా తెలుస్తోంది. నిజానికి గుంటూరు కారం సినిమాకి 212 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని నాగ వంశీ తాజాగా ప్రకటించారు. అయితే గతంలో ఒక సినిమా రిలీజ్ అయిన సమయంలో నిజమైన కలెక్షన్స్ కేవలం నిర్మాతలకు తప్ప ఎవరికీ తెలియదని, నిర్మాత కాస్త ఎక్కువగా పెంచి చెబుతారని నాగ వంశీ కామెంట్ చేశారు. ఇప్పుడు అదే వీడియోను తీసుకొచ్చి నాగ వంశీ212 కోట్లు కలెక్ట్ చేసినట్టు చెబుతున్న వీడియోకి అటాచ్ చేసి ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ నోటీసుల వ్యవహారం ఎంత దూరం వెళుతుంది అనేది తెలియాల్సి ఉంది.