రీసెంట్‌గా బాలీవుడ్ నుండి విడుదలైన ‘ఛావా’ మూవీ ఎలాంటి విజయం అందుకుందో చెప్పకర్లేదు. బాలీవుడ్‌లో స్టార్ హీరో, హీరోయిన్లు వికీ కౌశల్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న రిలీజై విజయ శంఖం మోగిస్తోంది. ప్రముఖ నిర్మాత దినేష్ విజన్ నిర్మాణ సారథ్యంలో మడోక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనంగా కలెక్షన్లు నమోదు చేస్తూ బాక్సాఫీస్ వద్ద విజృంభణ మొదలుపెట్టింది. ఇక తాజాగా ఈ సినిమాను తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ డిస్ట్రిబ్యూట్ చేయగా, మార్చి 7న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘ఛావా’. ఇక తెలుగులో కూడా ఈ సినిమాకు తొలి రోజు కాసుల పంట పండింది.
Also Read: Vishnu : ‘కన్నప్ప’నుంచి రానున్న రెండో పాట..ఎప్పుడంటే?
ఊహించినట్లుగానే ఇండియాలోను, ఓవర్సీస్‌లోను సంచలన విజయం సాధించిన ఈ చిత్రాన్నికి తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్రహ్మాండమైన ఆదరణ దక్కింది. ఆంధ్రా, నైజాంలో ప్రధాన నగరాల్లో సుమారుగా 60 శాతం ఆక్యుపెన్సీ నమోదవ్వగా, తాజా సమాచారం ప్రకారం రెండో రోజు కూడా అడ్వాన్స్ బుకింగ్ భారీగా నమోదు కావడం విశేషం.మొదటి రోజు 57 k+ బుక్కింగ్స్ అవ్వగా, 2వ రోజు 69 k+ బుక్కింగ్స్ అయ్యాయి. దీంతో మరిన్ని కలెక్షన్స్ కొల్లగొట్టడం ఖాయం.