Site icon NTV Telugu

Zee Telugu : ఆదివారం కూడా జీ తెలుగు సీరియల్స్

Zee

Zee

తెలుగు ప్రేక్షకులకు అంతులేని వినోదం అందించడంలో ముందుండే జీ తెలుగు మరో సర్ప్రైజ్‌తో వచ్చేస్తోంది. ప్రేక్షకుల ఆదరాభిమానాలతో విజయవంతంగా కొనసాగుతున్న సీరియల్స్‌ని ఇకనుంచి ఆదివారం కూడా అందించేందుకు సిద్ధమైంది. సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రసారమయ్యే సీరియల్స్ అన్నీ సెప్టెంబర్ 7 నుంచి ఆదివారం కూడా ప్రసారం అవుతాయి. నిండు నూరేళ్ల సావాసం, పడమటి సంధ్యారాగం, లక్ష్మీ నివాసం, మేఘసందేశం, జయం, చామంతి సీరియల్స్ ఇకనుంచి ఆదివారం కూడా తమ అభిమానులను అలరిస్తాయి.

Also Read :Tunnel : అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లతో ‘టన్నెల్’ ట్రైలర్

నిండు నూరేళ్ల సావాసం సాయంత్రం 6 గంటలకు, పడమటి సంధ్యారాగం 6:30 గంటలకు, లక్ష్మీ నివాసం రాత్రి 7 గంటలకు, మేఘసందేశం 7:30 గంటలకు, జయం 8 గంటలకు, చామంతి 8:30 గంటలకు ప్రసారం కానున్నాయి. ఈ నాన్‌స్టాప్ సీరియల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ వారం నుంచే ప్రారంభమవుతోంది. అశేష ప్రేక్షకాభిమానం పొందుతున్న ఈ ఆరు సీరియల్స్ ఇకనుంచి ప్రతిరోజూ ప్రేక్షకులను అలరించనున్నాయి. మధ్యాహ్నం సీరియల్స్ మాత్రం యథాతథంగా సోమవారం నుంచి శనివారం వరకు వాటి వాటి సమయాల్లో ప్రసారమై ప్రేక్షకులను అలరిస్తాయి.

Exit mobile version