NTV Telugu Site icon

Ummadi Kutumbam: నవంబర్​ 4 నుంచి కుటుంబమే ప్రధానంగా ‘ఉమ్మడి కుటుంబం’ సీరియల్​..

Ummadi

Ummadi

ఆసక్తికరమైన మలుపులు, ఆకట్టుకునే కథలతో సాగే సీరియల్స్​ అందిస్తున్న జీతెలుగు మరో సరికొత్త సీరియల్​ను తన అభిమాన వీక్షకులకు అందించేందుకు సిద్ధమైంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం, అనురాగాలనే పథ్యంలో సాగే ఆసక్తికరమైన కథ, కథనంతో రూపొందుతున్న సరికొత్త సీరియల్ ‘ఉమ్మడి కుటుంబం’. ఈ సీరియల్లో ఉమ్మడి కుటుంబం విశిష్టత, ప్రాధాన్యం, కుటుంబ సభ్యుల మధ్యనున్న అనుబంధం, ప్రేమ, బాధ్యతలు, అనురాగాలను కొత్త కోణంలో చూపించనున్నారు. ఆకట్టుకునే కథతో రానున్న ‘ఉమ్మడి కుటుంబం’ నవంబర్​ 4న ప్రారంభం, సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. ఉమ్మడి కుటుంబం అనే విలక్షణమైన కుటుంబ నేపథ్యంలో సాగే సరికొత్త సీరియల్​తో వచ్చేస్తోంది జీ తెలుగు. కుటుంబమే మొదటి ప్రాధాన్యతగా జీవిస్తున్న ఆనంద భైరవి(రూప) తన కొడుకు కోసం తగిన వధువుని వెతుకుతుంది. సౌమ్యత, గౌరవం కలబోసినట్లున్న శరణ్య(సాక్షి)ను తన కొడుక్కి తగిన భాగస్వామిగా నమ్ముతుంది ఆనంద.

శరణ్య సోదరి అనన్య (సుస్మిత) అందుకు పూర్తి భిన్నంగా ఆలోచిస్తూ స్వేచ్ఛాయుత జీవనాన్ని ఇష్టపడుతుంది. ఆనంద కుటుంబంలోకి అనన్య ఎలా ప్రవేశిస్తుంది? శరణ్య జీవితంలో ప్రతినాయకి ఎవరు? అనే విషయాలు తెలుసుకోవాలంటే ఉమ్మడి కుటుంబం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే! రూప (ఆనంద), యశ్వంత్ (దర్శన్), సాక్షి(శరణ్య) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నఈ సీరియల్లో కరమ్ (రోహిత్), సుస్మిత (అనన్య) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అన్నదమ్ములు, తోడికోడళ్ల అనుబంధం, అసూయ, ప్రతీకారం ముఖ్యాంశాలుగా ఆసక్తికరంగా సాగే ఉమ్మడి కుటుంబం సీరియల్​ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమవుతుంది. జీ తెలుగు అందిస్తున్న కొత్త సీరియల్ ​’ఉమ్మడి కుటుంబం’ ప్రారంభంతో ప్రస్తుతం ఉన్న ఇతర సీరియళ్ల ప్రసార సమయాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమవుతున్న సీతారామ ఇక నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రసారమవుతుంది. చాలాకాలంగా జీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న సూర్యకాంతం సీరియల్​ ముగియనుంది. ప్రేక్షకులు ప్రసార సమయాల్లో మార్పు గమనించి కొత్త సీరియల్ ఉమ్మడి కుటుంబంతో పాటు మీ అభిమాన సీరియల్స్​ మిస్ ​కాకుండా చూసేయండి!