Site icon NTV Telugu

Telangana: ఆ ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ ఎప్పుడు..?

ఆ ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ ఎప్పుడు..? సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోపు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ విచారణ ముగిస్తారా..? ఇప్పటికే 8మందిని విచారించగా ఆ ఇద్దరి దగ్గరే ఎందుకు ఆగింది? ఎవరా శాసన సభ్యులు? ఎపిసోడ్‌కు ఎండ్‌ కార్డ్‌ పడేది ఎప్పుడు?

తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్‌ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే 8 మంది విచారణ ముగించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. అందులో ఏడుగురికి సంబంధించి జడ్జిమెంట్ కూడా ఇచ్చారు. జగిత్యాల శాసనసభ్యుడు సంజయ్ మీదున్న అనర్హత పిటిషన్ విచారణ కూడా ముగిసింది గానీ… జడ్జిమెంట్ మాత్రం ఆగింది. అది ఎప్పుడన్న క్లారిటీ రావాల్సి ఉంది. ఇంతలో సుప్రీంకోర్టు రెండు వారాల గడువు విధించింది. ఇప్పుడు ఆ టైం కూడా దగ్గర పడుతున్న క్రమంలో సస్పెన్స్‌ పెరుగుతోంది. మరోవైపు ఈ అనర్హత పిటిషన్స్‌ ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల్లో కడియం శ్రీహరి, దానం నాగేందర్ కూడా ఉన్నారు.

Also Read:Dhulipalla Narendra Kumar: అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చా.. ఉచిత వైద్యానికి నేను వ్యతిరేకం!

దీంతో….మూడు పిటిషన్స్‌పై ఒకేసారి జడ్జిమెంట్ ఇస్తారా..? అన్న చర్చ కూడా మొదలైంది. స్పీకర్‌ నోటీసులకు ఇప్పటికే సమాధానం ఇచ్చారు కడియం.నేను పార్టీ మారలేదు, బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నానని వివరణ ఇచ్చుకున్నారాయన. కానీ… దానం నాగేందర్ నుంచి మాత్రం ఎలాంటి రియాక్షన్‌ లేదు. ఇక ఇప్పుడు సుప్రీంకోర్టు రెండు వారాల గడువు ఇచ్చిన క్రమంలో… స్పీకర్ మరోసారి నోటీసులు ఇచ్చి… విచారణ మొదలుపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. స్పీకర్ కోర్టులో పిటిషన్ దారులు,. పిటిషన్ ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అడ్వకేట్స్‌తో విచారణ జరగాల్సి ఉంది. త్వరలోనే స్పీకర్‌ ఈ ప్రక్రియను ప్రారంభిస్తారనే చర్చ జరుగుతోంది.

Also Read:Viral Video: యూఎస్‌లో గంటన్నర వైద్యానికి రూ.1.65 లక్షల బిల్లు.. వైరల్ అవుతున్న వీడియో!

కోర్టు ఇచ్చిన గడువు లోపు విచారణ పూర్తి చేయాలని స్పీకర్‌ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు స్పీకర్ ఇచ్చిన జడ్జిమెంట్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చారు ఫిర్యాదు దారులు. ఐతే.. పార్టీ మారిన MLA ల అనర్హత పిటిషన్ల పై పూర్తి స్థాయి విచారణ జరిగి జడ్జిమెంట్ వస్త్ లీగల్ గా నెక్స్ట్ ఎపిసోడ్ కంటిన్యూ అవుతుంది. అందుకే వీలైనంత త్వరగా ఈ పిటిషన్స్‌ని క్లియర్‌ చేయించే దిశగా అడుగులేస్తోంది ప్రతిపక్షం. అయితే… విచారణలో ప్రధానంగా దానం నాగేందర్ ఏం చెప్తారు..? BRS MLA గా గెలిచి… పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎలా బరిలో దిగారు? పార్టీ ఫిరాయింపులో ఇది ఆధారంగా ఉంటుంది కదా..? అనే ప్రశ్నలున్నాయి. ఇలా అనేక అనుమానాల మధ్య అనర్హత పిటిషన్స్‌కు ఎప్పుడు, ఎలా పరిష్కారం దొరుకుతుందో చూడాలి మరి.

Exit mobile version