Site icon NTV Telugu

Gaddar Awards : గద్దర్ అవార్డ్స్ మెమెంటో రిలీజ్ చేసిన ప్రభుత్వం

Gaddar Awards

Gaddar Awards

Gaddar Awards : తెలంగాణ ప్రభుత్వం పదేళ్ల తర్వాత గద్దర్ అవార్డుల పేరుతో సినిమా అవార్డులను ప్రకటించింది. ఇప్పటికే విజేతలను ప్రకటించిన ప్రభుత్వం.. ఈ నెల 14న హైటెక్స్ వేదికగా అంగరంగ వైభవంగా వేడుకలను నిర్వహించబోతోంది. ఈ సందర్భంగా గద్దర్ అవార్డుల మెమెంటోను తాజాగా తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, సినిమాటోగ్రఫీ శాఖ సంయుక్తంగా దీన్ని రూపొందించాయి.

చేతికి రీల్ చుట్టుకున్నట్టు ఉండి.. పైన చేతిలో డప్పు పట్టుకున్నట్టు ఉంటుంది. ఆ డప్పు మీద తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని ముద్రించారు. గద్దర్ గుర్తింపుగా డప్పును ముద్రించినట్టు తెలుస్తోంది. హైటెక్స్ లో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాబోతున్నారు.

వేడుకకు అవార్డులు గెలుచుకున్న వారితో పాటు టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరు కాబోతున్నారు. అవార్డు విజేతలకు ఈ మెమెంటోను అందించనున్నారు. వేడుకకోసం నగరంలోని చాలా ప్రాంతాల్లో హోర్డింగులను కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ వేడుక ఏ స్థాయిలో జరుగుతుందో చూడాలి.

Exit mobile version