NTV Telugu Site icon

Guntur Kaaram: గుంటూరు కారం టీంకి గుడ్ న్యూస్ చెప్పిన టీ సర్కార్

Guntur Kaarama

Guntur Kaarama

Telangana Government Good News to Guntur Kaaram Team: మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమా ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ అవుతోంది. ఇక ఈ సినిమా రిలీజ్ కి ముందు తెలంగాణ ప్రభుత్వం సినిమా టీంకి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమాకి రోజుకి ఆరు షోలు వేసుకునేలా పర్మిషన్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి వారం రోజుల పాటు ఉదయం నాలుగు గంటల నుంచి మొత్తం ఆరు షోలు వేసుకునే అవకాసహం కల్పించారు. ఇక దానితో పాటు సినిమా టికెట్ రేట్లు కూడా పెంచుకునే అవకాశం కల్పించారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లో టికెట్ మీద 65 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 100 చొప్పున పెంచుకోవచ్చని జీవోలో పేర్కొన్నారు. అంతేకాక గుంటూరు కారం సినిమా రిలీజ్ రోజున ఒంటిగంటకు షోలు వేసుకోవచ్చని ప్రకటించారు.

Jayadev: ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో డైరెక్టర్ మృతి

ఇక అలా ఒంటిగంట షోలు వేసుకునే థియేటర్ల లిస్టు కూడా మీ కోసం (1) నెక్సస్ మాల్, కూకట్‌పల్లి (2) AMB సినిమాస్, గచ్చిబౌలి (3) బ్రహ్మరాంబ థియేటర్, కూకట్‌పల్లి (4) మల్లికార్‌జంగ్ థియేటర్, కూకట్‌పల్లి (5) అర్జున్ థియేటర్, కూకట్‌పల్లి (6) విశ్వనాథ్ థియేటర్, కూకట్‌పల్లి (7) గోకుల్, ఎర్రగడ్డ (8) ) సుదర్శన్ 35MM థియేటర్, RTC X రోడ్స్ (9) రాజధాని డీలక్స్, దిల్‌సుఖ్ నగర్ (10) శ్రీరాములు థియేటర్, మూసాపేట్ (11) శ్రీ సాయిరాం థియేటర్, మల్కాజ్గిరి (12) శ్రీ ప్రేమ థియేటర్, తుక్కుగూడ (13) SVC తిరుమల్ థియేటర్ (14) థియేటర్, ఖమ్మం, (15) మమత థియేటర్, కరీంనగర్ (16) నటరాజ్ థియేటర్, నల్గొండ (17) SVC విజయ థియేటర్, నిజామాబాద్ (18) వెంకటేశ్వర థియేటర్, మహబూబ్‌నగర్ (19) శ్రీనివాస థియేటర్, మహబూబ్‌నగర్ (20) రాధిక థియేటర్, వరంగల్ (21) అమృత థియేటర్, హనుమకొండ (22) SVC మల్టీప్లెక్స్, గద్వాల్ మరియు (23) ప్రసాద్ మల్టీప్లెక్స్, నెక్లెస్ రోడ్.