Mirai : మిరాయ్ సినిమాతో తేజ సజ్జా భారీ రికార్డు అందుకున్నాడు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాకు యునానిమస్ సూపర్ హిట్ టాక్ వస్తోంది. దెబ్బకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. అయితే రెండో రోజు కలెక్షన్ల విషయంలో టైర్-2 హీరోల రికార్డును దాటేశాడు తేజ. ఇప్పటి వరకు టైర్-2 హీరోలుగా ఉన్న నాని, విజయ్ దేవరకొండ, నాగచైతన్య లాంటి వారికి కూడా సాధ్యం కాని రికార్డులను సృష్టించాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ ముగ్గురు హీరోల హిట్ సినిమాలు అయిన హిట్-3, తండేల్, కింగ్ డమ్, ఖుషి లాంటి వాటికి కూడా సాధ్యం కాని కలెక్షన్లు రాబట్టాడు.
Read Also : Bigg Boss-9 : ఆ కంటెస్టెంట్ కు పాజిటివ్ వైబ్స్.. విన్నర్ అయ్యే ఛాన్స్..?
రెండో రోజు ఈ సినిమాలను దాటేసి మిరాయ్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ.8.20 కోట్ల షేర్ రాబట్టింది. దెబ్బకు ఈ ముగ్గురి సినిమాను మిరాయ్ దాటేసింది. తేజసజ్జాకు ఈ ముగ్గురికి ఉన్నంత మార్కెట్ లేదు. అయినా సరే కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారు కదా. తొలి షో నుంచే మిరాయ్ కు యునానిమస్ హిట్ టాక్ రావడంతో పాటు.. వీఎఫ్ ఎక్స్ విజువల్స్ ను థియేటర్ లో చూస్తేనే అదిరిపోతుంది అనే ఉద్దేశంతో ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. అందుకే రెండో రోజు ఈ స్థాయి కలెక్షన్లు సాధ్యం అయ్యాయి.
